సురక్షిత మాతృత్వంతోపాటు మాతాశిశు ఆరోగ్యానికిగల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను ఉటంకిస్తూ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి రేఖావర్మ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:
“ఈ సమాచారం నాకెంతో సంతృప్తినిచ్చింది! దేశవ్యాప్తంగా మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోంది. కాబట్టే ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
बहुत ही संतोषजनक जानकारी! देशभर में माताओं और शिशुओं के स्वास्थ्य की बेहतर देखभाल के लिए हमारी सरकार ने निरंतर प्रयास किए हैं, जिसके परिणाम उत्साह बढ़ाने वाले हैं। https://t.co/YeXDKTyDg8
— Narendra Modi (@narendramodi) June 9, 2023