దృశ్య జ్ఞానం లోపించిన వర్గాల కు స్నేహ పూర్వకం గా ఉండేటటువంటి కొత్త శ్రేణి నాణేల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో విడుదల చేశారు. కొత్త శ్రేణి లో భాగం గా విడుదలైన నాణేల లో ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు మరియు 20 రూపాయల వంటి వివిధ వర్గసంకేతాల తో కూడిన నాణేలు ఉన్నాయి.
నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ నాణేల ను విడుదల చేయడమైంది. దృశ్య జ్ఞానం లోపించినటువంటి చిన్నారుల ను ఈ కార్యక్రమాని కి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ బాలల కు ఆతిథ్యం ఇస్తున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి తో భేటీ అయ్యే అవకాశాన్ని కల్పించినందుకు వారి కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కొత్త శ్రేణి నాణేల ను చెలామణి కోసం ప్రధాన మంత్రి విడుదల చేస్తూ, వరుస లోని చిట్టచివరి వ్యక్తి ని సైతం చేరుకోవాలనే దార్శనికత కేంద్ర ప్రభుత్వాని కి మార్గాన్ని చూపుతోందన్నారు. ఈ దార్శనికత ను దృష్టి లో పెట్టుకొని మరీ కొత్త శ్రేణి నాణేల కు రూపురేఖలను దిద్ది, వాటిని విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించారు.
పలు వ్యత్యాసభరిత అంశాల తో కూడుకొన్న ఈ కొత్త రకం నాణేలు దృశ్య జ్ఞానం లోపించిన వారి కి ఎంతగానో సహాయకారి అవుతాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ కొత్త శ్రేణి నాణేలు దృశ్య జ్ఞానం లోపించిన వర్గాల కు సౌకర్యవంతం గా ఉంటూ, వారి లో విశ్వాసాన్ని రేకెత్తించగలవని ప్రధాన మంత్రి అన్నారు.
దివ్యాంగ జన సముదాయం యొక్క సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న వివిధ కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దివ్యాంగుల కు మైత్రీపూర్వకంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలనే సూక్ష్మగ్రాహ్యత కేంద్ర ప్రభుత్వాని కి ఉందని ఆయన చెప్పారు.
నూతన నాణేల ను తీర్చిదిద్దినందుకుగాను నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు, ఇంకా ఈ నూతన నాణేల ను పరిచయం చేస్తున్నందుకుగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
నూతన శ్రేణి నాణేల ను ప్రవేశ పెట్టినందుకు చిన్నారులు ప్రధాన మంత్రి తో భేటీ అయిన సందర్భం లో ఆయన కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నాణేలు వారి యొక్క దైనందిన కార్యకలాపాల లో ఎంతో సౌలభ్యాన్ని అందించగలవని వారు అన్నారు.
కొత్త నాణేల ను ఉపయోగించడం దృశ్య జ్ఞానం లోపించిన వారికి సులభతరం గా ఉండే విధం గా వేరు వేరు నూతన అంశాల ను ఆ నాణేల లో చొప్పించడం జరిగింది.
తక్కువ నుండి ఎక్కువ వర్గసంకేతాలు కలిగిన నాణేలు ఆకారంలో మరియు బరువు లో విశిష్టతల ను కలిగివున్నాయి. కొత్త గా ప్రవేశపెట్టిన 20 రూపాయల నాణెం 12 కోణాలతో ఎటువంటి పదునైన కొసలకు తావు లేనిదిగా ఉంటుంది. మిగతా వర్గసంకేతాలకు చెందిన నాణేలు గుండ్రని ఆకారం లో ఉంటాయి.
ఈ కార్యక్రమం లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ మరియు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పొన్ రాధాకృష్ణన్ లు కూడా పాల్గొన్నారు.
**