దుస్తులు / వస్త్రాలు (చాప్టర్ – 61 & 62), మేడ్-అప్స్ (చాప్టర్-63), ఈ అధ్యాయాలలో ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకం మరియు పన్నుల మినహాయింపు (ఆర్.ఓ.డి.టి.ఈ.పి) పథకం నుండి మినహాయించిన ఎగుమతులపై, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ 2019 మర్చి, 8వ తేదీన జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్న రేట్లతో, రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు, సుంకాల (ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్) తగ్గింపును కొనసాగించడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి, ఆమోదం తెలిపింది. ఈ పథకం 2024 మార్చి, 31వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పరిధిలోకి రాని ఇతర వస్త్ర ఉత్పత్తులు (అధ్యాయాలు-61, 62 & 63 మినహా), ఆర్.ఓ.డి.టి.ఈ.పి. కింద, వాణిజ్య శాఖ ఖారారు చేసిన ఇతర ఉత్పత్తులతో పాటు, ఈ ప్రయోజనాలను పొందటానికి, వాణిజ్య శాఖ, ఈ విషయమై, ప్రకటించే తేదీల నుండి అర్హత కలిగి ఉంటాయి.
ఎగుమతి చేసిన ఉత్పత్తులకు పన్ను వాపసు
పన్నులు, సుంకాలు తిరిగి చెల్లించబడని మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా పొందుపరిచిన పన్నులలో భాగమైన కొన్ని ఇతర పన్నులు, సుంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: –
వస్తువుల రవాణా, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ రంగానికి ఉపయోగించే ఇంధనం పై కేంద్ర మరియు రాష్ట్ర పన్నులు, సుంకాలు, ఇతర పన్నులు.
మండీ (సంత) పన్ను
ఉత్పత్తి వ్యవస్థ కు చెందిన అన్ని స్థాయిలలో విద్యుత్ ఛార్జీలపై సుంకం
స్టాంపు డ్యూటీ
పురుగుమందులు, ఎరువులు మొదలైన వాటిపై చెల్లించిన జి.ఎస్.టి.
నమోదుకాని డీలర్ల నుండి కొనుగోళ్లకు చెల్లించిన జి.ఎస్.టి.
బొగ్గు లేదా ఇతర ఉత్పత్తులపై సుంకం.
ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పథకాన్ని ప్రారంభించిన ఒక సంవత్సరం తరువాత మహమ్మారి ఏర్పడ్డంతో, ఎగుమతిదారులకు కొంత స్థిరమైన విధాన పాలనను అందించాల్సిన అవసరం ఉందని భావించడం జరిగింది. వస్త్ర పరిశ్రమలో, కొనుగోలుదారులు దీర్ఘకాలిక ఆర్డర్లు ఇస్తారు. దాంతో, ఎగుమతిదారులు తమ కార్యకలాపాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అందువల్ల, ఈ ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించిన పాలసీ విధానం స్థిరంగా ఉండాలి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పథకాన్ని, 2024 మార్చి 31వ తేదీ వరకు స్వతంత్రంగా ఒక ప్రత్యేక పథకం గా కొనసాగించాలని, జౌళి మంత్రిత్వ శాఖ, నిర్ణయించింది.
ఆర్.ఓ.ఎస్.సి.టి.ఎల్. పథకాన్ని కొనసాగించడం వల్ల, అదనపు పెట్టుబడులను సమీకరించడానికీ, లక్షలాది మంది మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడానికీ, సహాయపడుతుంది.
*****