యుఎఇ యొక్క ఉపాధ్యక్షుడు, ప్రధాని, రక్షణ మంత్రి మరియు దుబయి పాలకుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుబయి లో 2024 ఫిబ్రవరి 14 వ తేదీ నాడు సమావేశమయ్యారు.
ఇద్దరు నేత లు ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన అనేక రంగాల ను గురించి చర్చలు జరిపారు. ఆయా రంగాల లో వ్యాపారం, పెట్టుబడి, సాంకేతిక విజ్ఞానం, అంతరిక్షం, విద్య మరియు ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటివి ఉన్నాయి. భారతదేశాని కి మరియు యుఎఇ కి మధ్య ఆర్థిక సంబంధాలు మరియు వాణిజ్య సంబంధాలు శరవేగం గా వృద్ధి చెందుతూ ఉండడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరీ ముఖ్యం గా కాంప్రిహెన్సివ్ ఇకానామిక్ పార్ట్నర్శిప్ ఎగ్రిమెంట్ పోషించినటువంటి కీలక పాత్ర ను వారు గుర్తించారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒడంబడిక పై సంతకాలు కావడాన్ని కూడా వారు స్వాగతించారు.
దుబయి లో ఉంటున్న భారతీయ సముదాయం పట్ల ప్రధాని శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ అనుగ్రహాని కి గాను ఆయన కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఒక ప్రపంచస్థాయి వ్యాపారం, సేవలు మరియు పర్యటన ప్రధాన కేంద్రం గా దుబయి ఎదగడం లో భారతీయ ప్రవాసులు అందించిన తోడ్పాటు ను ఇరువురు నేత లు ప్రశంసించారు.
దుబయి లో ఇండియన్ కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమి ని ఇచ్చినందుకు ప్రధాని శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ కు ప్రధాన మంత్రి అమిత ప్రశంస ను వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి భారతీయ శ్రమికుల కు తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ను అందజేయనుంది.
మంత్రి శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ రాశిద్ అల్ మక్తూమ్ ఆయన కు వీలు అయినంత త్వరలో భారతదేశాన్ని సందర్శించడానికి రావలసింది గా ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
***
PM @narendramodi and Vice President and PM of UAE @HHShkMohd held a wonderful meeting in Dubai.
— PMO India (@PMOIndia) February 14, 2024
They leaders discussed various aspects of bilateral cooperation, spanning trade and investment, technology, education and people-to-people ties. pic.twitter.com/9XaMyOdF9e