Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దుంగ్తి గ్రామంలో మైనస్‌ 30 డిగ్రీల చలిలోనూ కొళాయి నీటి సరఫరాపై ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు


   తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌జోక్‌ సమీపానగల దుంగ్తి గ్రామంలో మైనస్‌ 30 డిగ్రీల చలిలోనూ కొళాయి నీరు సరఫరా కావడంపై అక్కడి ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

దీనిపై పార్లమెంటు సభ్యుడు జమ్యాంగ్‌ షెరింగ్‌ నాంగ్యాల్‌ ట్వీట్‌కు ప్రతిస్పందన ట్వీట్‌లో:

   “దుంగ్తి గ్రామ ప్రజలకు అభినందనలు. ‘ఇంటింటికీ కొళాయి నీరు’ వాగ్దానం నెరవేర్చేందుకు మేం కచ్చితంగా కట్టుబడి ఉన్నాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.