దివ్యాంగుల రంగంలో భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య సహకారానికి సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది. ఈ ఎంఒయు పై 2018 నవంబర్ 22వ తేదీన సిడ్నీ లో సంతకాలయ్యాయి.
ప్రయోజనాలు :
ఈ ఎంఒయు భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య దివ్యాంగుల రంగం లో సహకారానికి సంబంధించి సంయుక్త చర్యలను తీసుకొనేందుకు ప్రోత్సాహాన్నిస్తుంది. ఇది భారతదేశం, ఆస్ట్రేలియా ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయనుంది. దీనికి తోడు మేధోపరమైన వైకల్యం, మానసిక అనారోగ్యం కలిగిన వ్యక్తుల పునరావాస సదుపాయాలను ఉభయ దేశాల లో మెరుగుపరచేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. పరస్పరం అంగీకారం కుదిరిన మేరకు దివ్యాంగుల రంగం లో ప్రత్యేక ప్రతిపాదనల అమలు కు ఉభయ దేశాలు నిర్దిష్ట చర్య లను చేపడుతాయి.