Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని


దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారుఆయన దూరదృష్టి గల సినీ రూపకర్తనటుడువెండితెర సార్వభౌముడనీ ప్రధాని కొనియాడారుశ్రీ రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదని భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సాంస్కృతిక రాయబారిగా వర్ణిస్తూఅనేక తరాలపాటు సినిమా దర్శకులునటులు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టు:

‘‘ఈ రోజు దిగ్గజ నటుడుదర్శకుడు రాజ్ కపూర్ శత జయంతిని జరుపుకుంటున్నాంఆయన దూరదృష్టి గల సినీ రూపకర్తనటుడువెండితెర సార్వభౌముడుఆయన భారతీయఅంతర్జాతీయ చిత్ర రంగంపై తరాలు మారినా చెరగని ముద్ర వేశారు’’

‘‘శ్రీ రాజ్ కపూర్‌కు చిన్న వయసులోనే సినిమాపై ఆసక్తి ఏర్పడిందిఆదర్శవంతమైన కథకుడిగా ఎదిగేందుకు కష్టపడి పనిచేశారుఆయన సినిమాలు– కళానైపుణ్యంభావుకతసామాజిక వ్యాఖ్యానాల సమ్మేళనంఅవి సామాన్యుల ఆకాంక్షలనువారు సాగించే జీవన సమస్యల్ని ప్రతిబింబిస్తాయి’’.

‘‘రాజ్ కపూర్ చిత్రాల్లోని పాత్రలుమరచిపోలేని మధుర గీతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయివైవిధ్యమైన ఇతివృత్తాలను సులభంగాగొప్పగా చిత్రీకరించిన ఆయన పనితీరును ప్రజలు మెచ్చుకుంటారుఆయన సినిమాల్లోని సంగీతం కూడా ప్రజాదరణ పొందింది.

 ‘‘శ్రీ  రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదు భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సాంస్కృతిక రాయబారితరాలు మారినా చిత్ర దర్శకులునటులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉందిసృజనాత్మక ప్రపంచానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ.. మరోసారి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను’’.

 

***