Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దమన్ లోని నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు నుదేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి


దమన్ లో నమో పథ్ ను, దేవ్ కా సీఫ్రంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం చేశారు. ప్రధాన మంత్రి కార్య స్థలాని కి చేరుకొన్న తరువాత నిర్మాణ శ్రమికుల తో మాట్లాడారు. వారితో కలసి ఒక ఛాయాచిత్రాన్ని తీయించుకొన్నారు. ఆయన ‘నయా భారత్ సెల్ఫీ పాయింటు’ ను సైతం చూడడానికి వెళ్లారు.

దాదాపు  గా 165 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం జరిగిన 5.45 కి.మీ. ల దేవ్ కా సీఫ్రంటు దేశం లో తనదైనటువంటి ఒకే ఒక సముద్ర తీర ప్రాంత విహార స్థలం అని చెప్పాలి. ఈ సీఫ్రంటు తో స్థానిక ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహం లభిస్తుందన్న ఆశ ఉంది. ఈ సీఫ్రంటు ఆ ప్రాంతం మనోరంజక కార్యకలాపాల కు ఖాళీ సమయాన్ని ఆహ్లాదం గా గడపడానికి అనుకూలమైంది గా మారి, మరింత మంది యాత్రికులు ఆ ప్రాంతాని కి తరలి వచ్చేందుకు ఒక ఆకర్షణ కేంద్రం గా నిలవనుంది. స్మార్ట్ లైటింగ్, పార్కింగ్ సదుపాయాలు, తోట లు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, వినోద కార్యకలాపాల కు తగినటువంటి ప్రదేశాల తో పాటు గా రాబోయే కాలం లో విలాసవంతమైన గుడారాల నగరాన్ని నిర్మించేందుకు కూడా తగిన ఏర్పాటు సహా ఈ సీఫ్రంట్ ను ఒక ప్రపంచ శ్రేణి యాత్రా స్థలం గా తీర్చిదిద్దడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి వెంట దాద్ రా మరియు నగర్ హవేలీ, ఇంకా దమన్ మరియు దీవ్ లతో పాటు లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకుడు శ్రీ ప్రఫుల్ల్ పటేల్ ఉన్నారు.