ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మతెమెలా సిరిల్ రామాఫోసా తో ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
నేతలు ఇద్దరు చారిత్రిక మరియు సుదృఢమైనటువంటి పరస్పర ప్రజా సంబంధాల పై ఆధారపడి ఉన్న ద్వైపాక్షిక సహకారం లో పురోగతి ని గురించి సమీక్షించారు. ఈ సంవత్సరం మొదట్లో 12 చిరుతపులుల ను భారతదేశం లోకి తీసుకు రావడం లో తోడ్పాటు ను అందించినందుకు గాను దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుని కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
వారు ఈ సంవత్సరం లో దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న బిఆర్ఐసిఎస్ లో సహకారం అంశం తో పాటు గా అనేక ప్రాంతీయ అంశాల ను గురించి మరియు పరస్పర హితం ముడిపడ్డ ప్రపంచ అంశాల ను గురించి ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి వెల్లడించుకొన్నారు.
ఆఫ్రికన్ లీడర్స్ పీస్ ఇనిశియేటివ్ ను గురించి ప్రధాన మంత్రి దృష్టి కి అధ్యక్షుడు శ్రీ రామాఫోసా తీసుకు వచ్చారు. యూక్రేన్ లో శాంతి కి మరియు స్థిరత్వాని కి పూచీ పడే ఉద్దేశ్యం తో అమలు పరచే అన్ని కార్యక్రమాల కు భారతదేశం తన సమర్థన ను వ్యక్తం చేసింది అని ప్రధాన మంత్రి తెలియజేశారు. చర్చ లు మరియు దౌత్యం లు మన ముందు ఉన్నటువంటి మార్గం అని భారతదేశం పిలుపు ను ఇస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం జి20 కి భారతదేశం యొక్క అధ్యక్షత న చేపట్టే వివిధ కార్యక్రమాల కు ప్రెసిడెంటు శ్రీ రామాఫోసా తన పూర్తి మర్థన ను వ్యక్తం చేశారు. భారతదేశాన్ని సందర్శించడం కోసం తాను ఉత్సాహపడుతున్నట్లు ఆయన తెలియ జేశారు.
నేతలు ఇరువురు పరస్పరం సంప్రదింపులు జరుపుకోవడాన్ని కొనసాగించే విషయం లో వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.
**
Spoke with President @CyrilRamaphosa. Reviewed progress in bilateral cooperation. Discussed regional and global issues, including cooperation in BRICS and African Leaders’ Peace Initiative.@PresidencyZA
— Narendra Modi (@narendramodi) June 10, 2023