Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

థాయ్ లాండ్ రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


థాయ్ లాండ్ రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

“మన తరంలో అత్యున్నత నాయకులలో ఒకరైన రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ మరణం పట్ల దుఖఃంలో మునిగిన థాయ్ లాండ్ ప్రజల వెంట భారతదేశ ప్రజలు మరియు నేను నిలుస్తున్నాము.

రాజు శ్రీ భూమిబోల్ అదుల్యాదేజ్ లేదా రామ 9 అంటే ఆయన ప్రజలకు అమిత గౌరవం. ఆయన అసంఖ్యాక శ్రేయోభిలాషులు మరియు కుటుంబ సభ్యులకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***