ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ మాజీ ప్రధాని శ్రీ తక్సిన్ షినావత్రాతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సంస్కృతి తదితర రంగాల్లో భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య సహకారానికి ఉన్న అపార అవకాశాలపై చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు.
‘థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినావత్రాను కలవడం ఆనందంగా ఉంది. పాలన, విధాన రూపకల్పనకు సంబంధించిన విషయాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ఆయన భారత్‌కు గొప్ప మిత్రుడు. అటల్ జీతో చాలా ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారు.
శ్రీ షినావత్రా, నేను భారత్–థాయ్‌లాండ్ సహకారం గురించి, అది మన దేశాల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. రక్షణ, వాణిజ్యం, సంస్కృతి తదితర రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలపై చర్చించాం.
@ThaksinLive”
It was a delight to meet Mr. Thaksin Shinawatra, the former Prime Minister of Thailand. He has extensive experience in matters relating to governance and policy making. He is also a great friend of India and had a very warm relationship with Atal Ji.
— Narendra Modi (@narendramodi) April 3, 2025
Mr. Shinawatra and I talked… pic.twitter.com/jBJDZx6Ziw