తమిళ నాడు లోని కున్నూర్ లో కొత్త గా వైరల్ వ్యాక్సిన్ తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడం కోసం పాస్చర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పిఐఐ) కి 30 ఎకరాల భూమి ని కేటాయించే ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ పథకంలో భాగం గా పిఐఐ, కున్నూర్ లో టిసిఎ తట్టు నిరోధక టీకామందు, జపాన్ ఇన్ సెఫలైటిస్ [జెఇ] టీకామందు ల వంటి వైరల్ వ్యాక్సీన్ ల ను, ఇంకా పాము విషాని కి విరుగుడు గాను మరియు పిచ్చి కుక్క కాటు కు విరుగుడు గాను పని చేసేటటువంటి టీకా రసి ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ప్రోజెక్టు కు అవసరమైన భూమి ని ఉచితం గా బదలాయించడం జరుగుతుంది.
ఆరోగ్యం, ఇంకా కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకం కోసం వినియోగించేటటువంటి భూమి ని ‘పారిశ్రామిక వినియోగం’ నుండి ‘సంస్థాగత వినియోగం’గా మార్చడం జరుగుతుంది.
ప్రయోజనాలు:
ఈ భూమి కేటాయింపు ద్వారా బాలల కు ప్రాణ రక్షక టీకామందు ల ఉత్పత్తి కి ప్రోత్సాహం అందడం, దేశం లో టీకామందు సంబంధిత భద్రత పటిష్టం కావడం తో పాటు ఈ మందుల తయారీ కి అయ్యే ఖర్చు ను తగ్గిస్తుంది కూడాను. అంతేకాదు ఈ తరహా మందుల ను ప్రస్తుతం దిగుమతి చేసుకొంటుండగా ఇది దిగుమతి కి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపనుంది.