తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు కొండా సురేఖ గారు, కె.వెంకటరెడ్డి గారు, పార్లమెంటులో నా సహచరులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్.
సంగారెడ్డి ప్రజలకు నా నమస్కారం.
తెలంగాణను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా అహర్నిశలు కృషి చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ఈ రోజు వరుసగా రెండో రోజు మీ మధ్య తెలంగాణలో ఉన్నాను. నిన్న ఆదిలాబాద్ నుంచి తెలంగాణ, దేశ అభివృద్ధి కోసం రూ.56 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాను. ఈ రోజు సంగారెడ్డి నుంచి సుమారు 7 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం నాకు లభించింది. వీటిలో రహదారులు, రైల్వేలు, వాయుమార్గాలకు సంబంధించిన ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పెట్రోలియం సంబంధిత ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇంధనం, పర్యావరణం నుంచి మౌలిక సదుపాయాల వరకు వివిధ రంగాలకు సంబంధించి తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి పనులు నిన్న జరిగాయి. – రాష్ట్ర అభివృద్ధి ద్వారా దేశ అభివృద్ధి- నేను ఈ స్ఫూర్తిని అనుసరిస్తున్నాను. ఇదీ మా పని తీరు, ఈ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కూడా సేవలందిస్తోంది. ఈ సందర్భంగా మీ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేడు విమానయాన రంగంలో తెలంగాణకు భారీ కానుక లభించింది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన పరిశోధన సంస్థ (సీఏఆర్) ఏర్పాటైంది. ఇలాంటి ఆధునిక ప్రమాణాలతో నిర్మించిన తొలి విమానయాన కేంద్రం దేశంలో ఇదే అవుతుంది. ఈ కేంద్రం హైదరాబాద్ కు, తెలంగాణకు కొత్త గుర్తింపును ఇస్తుంది. ఇది తెలంగాణ యువతకు విమానయాన రంగంలో కొత్త దారులు తెరవనుంది. దేశంలో ఏవియేషన్ స్టార్టప్ లకు పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ఇది ఒక వేదికను అందిస్తుంది. నేడు భారతదేశంలో విమానయాన రంగం కొత్త రికార్డులు సృష్టిస్తున్న తీరు, గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిన తీరు, ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్న తీరు, ఈ అవకాశాలన్నింటినీ విస్తరించడంలో ఈ ఆధునిక హైదరాబాద్ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
మిత్రులారా,
నేడు 140 కోట్ల మంది దేశ ప్రజలు అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి ఆధునిక మౌలిక సదుపాయాలు ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ ఏడాది బడ్జెట్ లో మౌలిక సదుపాయాలకు రూ.11 లక్షల కోట్లు కేటాయించాం. దాని వల్ల తెలంగాణకు ఎక్కువ ప్రయోజనం చేకూరేలా చూడాలన్నదే మా ప్రయత్నం. నేడు ఇండోర్-హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్‌లో ముఖ్యమైన భాగంగా జాతీయ రహదారి విస్తరించింది.. ‘కంది-రాంసాన్ పల్లి’ ఈ విభాగాన్ని ప్రజల లబ్ధికై అంకితం చేయబడింది. అదేవిధంగా ‘మిర్యాలగూడ-కోదాడ‘ ఈ విభాగం కూడా పూర్తయింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు మార్గం సుగమం కానుంది. దీంతో సిమెంట్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది. నేడు సంగారెడ్డి నుంచి మదీనాగూడ వరకు జాతీయ రహదారికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పూర్తయితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుంది. 1300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వనుంది.
మిత్రులారా,
తెలంగాణను దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారం(గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా) అని అంటారు. తెలంగాణలో రైలు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సనత్ నగర్-మౌలా అలీ మార్గంలో డబ్లింగ్, విద్యుదీకరణతో ఆరు కొత్త స్టేషన్లను నిర్మించారు. ఇవాళ ఘట్ కేసర్ -లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైలును కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. దీని ప్రారంభంతో హైదరాబాద్, సికింద్రాబాద్ లోని మరిన్ని ప్రాంతాలు అనుసంధానం కానున్నాయి. ఇది రెండు నగరాల మధ్య రైలు ప్రయాణీకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
మిత్రులారా,
ఈ రోజు పారాదీప్-హైదరాబాద్ పైప్ లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే అదృష్టం నాకు దక్కింది. దీనివల్ల పెట్రోలియం ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో సురక్షితమైన రీతిలో రవాణా చేయడానికి వీలవుతుంది. సుస్థిర అభివృద్ధి కోసం మా సంకల్పాన్ని ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుంది. రాబోయే కాలంలో అభివృద్ధి చెందిన తెలంగాణ నుంచి అభివృద్ధి చెందిన భారతదేశం వరకు ఈ ఉద్యమానికి మరింత ఊతమిస్తాం.
మిత్రులారా,
ఈ చిన్న ప్రభుత్వ కార్యక్రమం ఇక్కడ పూర్తవుతోంది. నేను దగ్గరలో ఉన్న ప్రజల వద్దకు వెళతాను, అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ విషయాల గురించి చాలా వినాలనుకుంటున్నారు. పదినిమిషాల తర్వాత బహిరంగ సభలో కొన్ని విషయాలను వివరంగా చెబుతాను, ప్రస్తుతానికి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను, మీ అందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
Addressing a programme at the launch of development works in Sangareddy, Telangana.https://t.co/NTXrp0hh1a
— Narendra Modi (@narendramodi) March 5, 2024
हैदराबाद के बेगमपेट एयरपोर्ट पर Civil Aviation Research Organization यानी ‘कारो’ की स्थापना की गई है।
— PMO India (@PMOIndia) March 5, 2024
ये अपने तरह का देश का पहला एविएशन सेंटर होगा, जो ऐसे आधुनिक स्टैंडर्ड्स पर बना है: PM @narendramodi pic.twitter.com/tpLKioFiKp
आज 140 करोड़ देशवासी विकसित भारत के निर्माण के लिए संकल्पबद्ध हैं: PM @narendramodi pic.twitter.com/OGrzD3mz1s
— PMO India (@PMOIndia) March 5, 2024