తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు జి.కిషన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు గారు, ఆదిలాబాద్ శాసన సభ్యులు పి.శంకర్ గారు, ఇతర ప్రముఖులు.
నేడు ఆదిలాబాద్ గడ్డ తెలంగాణకే కాదు యావత్ దేశానికి ఎన్నో అభివృద్ధి బాటలు వేస్తోంది. ఈ రోజు మీ మధ్య 30కి పైగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం నాకు లభించింది. ఈ ప్రాజెక్టులు తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. వీటిలో అనేక భారీ ఇంధన సంబంధిత ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ, తెలంగాణలో ఆధునిక రహదారి నెట్వర్క్ ను అభివృద్ధి చేసే రహదారులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం తెలంగాణ సోదర సోదరీమణులతో పాటు దేశ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పదేళ్లు అవుతోంది. తెలంగాణ ప్రజలు కలలు కన్న అభివృద్ధిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఇప్పటికీ 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఎన్టీపీసీ రెండో యూనిట్ ను తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. దీంతో తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యం మరింత పెరిగి రాష్ట్ర అవసరాలు తీరనున్నాయి. అంబారీ-ఆదిలాబాద్-పింపల్కుట్టి రైలు మార్గం విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి. ఇవాళ ఆదిలాబాద్-బేల, ములుగులో రెండు కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఆధునిక రైలు, రోడ్డు సౌకర్యాలు మొత్తం ప్రాంతం, తెలంగాణ అభివృద్ధికి మరింత ఊతమిస్తాయి. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది, పరిశ్రమలు, పర్యాటకానికి ఊతమిస్తాయి. అంతే కాక లెక్కలేనన్ని కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
మిత్రులారా,
రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి మంత్రాన్ని మన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, దేశంలో విశ్వాసం పెరిగినప్పుడు, అప్పుడు రాష్ట్రాలు కూడా దాని ప్రయోజనాన్ని పొందుతాయి, రాష్ట్రాల్లో పెట్టుబడులు కూడా పెరుగుతాయి. గత 3-4 రోజులుగా భారతదేశ వేగవంతమైన వృద్ధి రేటు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించడం మీరు చూశారు. గత త్రైమాసికంలో 8.4 వృద్ధి రేటుతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ వేగంతో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. దీని వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది.
మిత్రులారా,
ఈ పదేళ్లలో దేశ పని తీరు ఎలా మారిందో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. అంతకుముందు కాలంలో తెలంగాణ వంటి అత్యంత నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం చాలా ఎక్కువ నిధులు వెచ్చించింది. మాకు అభివృద్ధి అంటే నిరుపేదల అభివృద్ధి, దళితులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి! ఈ ప్రయత్నాల ఫలితంగా నేడు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. మన సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమైంది. వచ్చే ఐదేళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ సంకల్పంతో, నేను మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత నేను బహిరంగ సభలో మాట్లాడేందుకువెళ్తున్నాను. నేను మాట్లాడబోయే అనేక ఇతర అంశాలు ఆ వేదికకు బాగా సరిపోతాయి. అందుకని ఇంతటితో ఈ వేదికపై నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. 10 నిమిషాల తర్వాత ఆ బహిరంగ సభలో చాలా విషయాలు ఓపెన్ మైండ్ (మనసు విప్పి) తో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడకు రావడానికి సమయాన్ని వెచ్చించినందుకు ముఖ్యమంత్రికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంకల్పంతో కలిసి అభివృద్ధి ప్రయాణంలో ముందుకు సాగుదాం.
చాలా ధన్యవాదాలు.
****
From Adilabad in Telangana, launching development initiatives that will further strengthen the country's power, road and rail infrastructure.https://t.co/KV6jbwPsh4
— Narendra Modi (@narendramodi) March 4, 2024
जिस विकास का सपना तेलंगाना के लोगों ने देखा था, उसे पूरा करने में केंद्र सरकार हर तरह से सहयोग कर रही है: PM pic.twitter.com/8I3Z7ksFP2
— PMO India (@PMOIndia) March 4, 2024
राज्यों के विकास से देश का विकास। pic.twitter.com/11cmY9t9wf
— PMO India (@PMOIndia) March 4, 2024