Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తాడాసన ను గురించిన వీడియో క్లిప్ ను శేర్చేసిన ప్రధాన మంత్రి


‘తాడాసన’, మరో మాట లో చెప్పాలి అంటే తాటి చెట్టు ను పోలినటువంటి భంగిమ ను గురించిన ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పోస్ట్ చేశారు.

 

జూన్ 21 వ తేదీ నాడు యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక ను పాటించవలసి ఉన్న సందర్భం లో శేర్ చేసినటువంటి ఈ క్లిప్, మనిషి నిలబడి వేయవలసిన తాడాసన తాలూకు దశలను మరియు ఈ విధమైన యోగాసనాన్ని చేయడం వల్ల ఒనగూరే ఆరోగ్య సంబంధి ప్రయోజనాల ను చాటి చెప్పింది.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో –

‘‘తాడాసన అనేది మానవ దేహాని కి చాలా మేలు ను చేసేటటువంటిది. ఇది శరీరానికి మరింత బలాన్ని ఇవ్వడం తో పాటుగా మెరుగైన సమతుల్యత కు పూచీపడుతుంది’’ అని పేర్కొన్నారు.