Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళ నాడు లో సేలమ్ రేల్ వే జంక్శన్ లోవందే భారత్ కు అపూర్వ స్వాగతం పలికినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


తమిళ నాడు లోని సేలమ్ రేల్ వే జంక్శన్ లో అక్కడి ప్రజలు వందే భారత్ కు అపురూపమైనటువంటి స్వాగతాన్ని పలికినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలు ఎంతో ఆనందంతోను, ఉల్లాసం తోను సేలమ్ రేల్ వే జంక్శను లో రైలుబండి మీద పూల ను చల్లారు.

తమిళ నాడు లో పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) చేసినటువంటి ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ –

‘‘సేలమ్ లో అపూర్వ స్వాగతం!

వందే భారత్ ఎక్స్ ప్రెస్ వివిధ స్థలాల ను చేరుకొంటోంది అంటే, ప్రజల లో ఇదే తరహా ఉత్సాహం వ్యక్తం కావడమనేది సాధారణం అయిపోయింది, ఇది భారతదేశ ప్రజల లో వ్యక్తం అవుతున్నటువంటి గౌరవ భావన ను చాటి చెబుతున్నది.’’ అని పేర్కొన్నారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడం హాయి గా ఉంది అంటూ శ్రీమతి వానతి శ్రీనివాసన్ ఒక ట్వీట్ లో వ్యక్తం చేసిన అభిప్రాయం పట్ల కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్సందిస్తూ –

‘‘అద్భుతం!’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST