Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడు కృష్ణ ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటన పట్ల సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


తమిళనాడులోని కృష్ణగిరిలో ఒక టపాసుల కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం తెలిపారు.  ఈ దుర్ఘటనలో మరణించిన ఒక్కొక్కరి తరఫున, వారి వారసులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్ కింద రెండు లక్షల రూపాయల పరిహారం , గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందివ్వనున్నట్టు తెలిపారు.

ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ చేస్తూ, ‘‘ తమిళనాడులోని క్రుష్ణగిరిలో ఒక టపాసుల కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో కొందరు విలువైన ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఆలోచనలు అన్నీ మరణించిన వారి గురించి ఉన్నాయని, బాధితుల కుటుంబాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్ట  సమయంలో వారి కోసం ప్రార్థిస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. మరణించిన ఒక్కొక్కరి పేరుమీద పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్ కింద వారి వారసులకు రెండులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మంజూరు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే బాధితులకు రూ 50 వేల రూపాయలు అందించనున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు ’’ అని పేర్కొన్నారు.