Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడులోని దిండిగల్ గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ 36 వ స్నాతకోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి

తమిళనాడులోని దిండిగల్ గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ 36 వ స్నాతకోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమిళనాడులోని దిండిగల్లో గల గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 2018‌‌–19,2019‌‌–20 బ్యాచ్లకు చెందిన 2300 విద్యార్థులు స్నాతకోత్సవంలో తమ పట్టాలు అందుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి అర్హులైన వారికి స్వర్ణపతకాలు, గౌరవపట్టాలు అందజేశారు. 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గాంధీగ్రామ్కు రావడం తనకు ఎంతో ప్రేరణ కలిగించే అనుభవమని అన్నారు. ఈ సంస్థను మహాత్మాగాంధీ ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి  ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీ ఆదర్శాలు, గ్రామీణాభివృద్ధికి వారి ఆలోచనల ప్రేరణను ఈ సంస్థలో గమనించవచ్చని  ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో మహాత్మాగాంధీ ఆదర్శాలు ఎంతో అనుసరణీయత కలిగి ఉన్నాయని అన్నారు. ఘర్షణల నివారణలోను, వాతావరణ సంక్షోభం విషయంలో ఇంకా ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేకానేక సవాళ్ళు, సమకాలీన సమస్యలకు మహాత్ముడి ఆలోచనలలో పరిష్కారం లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
గాంధేయమార్గం లోని విద్యార్థులు సమాజంపై విస్తృత ప్రభావాన్ని చూపేందుకు మంచి అవకాశం  ఉందనిఅంటూ ప్రధానమంత్రి, మహాత్మాగాంధీకి అత్యుత్తమ నివాళి అంటే , ఆయన హృదయానికి దగ్గరగల ఆలోచనలపై కృషి చేయడమే నని అన్నారు. ఇందుకు ఆయన ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ ను ఉదాహరణగా చెప్పారు. ఇది నిరాదరణకు గురైన, మరిచిపోయిన రంగాన్ని ఎంతో కాలం తర్వాత మళ్లీ పునరుద్ధరింప చేసిందన్నారు. గత 8 సంవత్సరాలలో ఖాదీ రంగంలో అమ్మకాలు 300 శాతం పెరిగాయని , ఖాదీ అండ్ విలేజ్
ఇండస్ట్రీస్ కమిషన్ రికార్డు స్థాయిలో గత ఏడాది లక్షకోట్ల రూపాయల టర్నొవర్   సాధించిందని ప్రధానమంత్రి చెప్పారు.
అంతర్జాతీయ ఫాషన్ బ్రాండ్లు సైతం ఖాదీని వాడుతున్నాయని, దీనికి గల పర్యావరణ హితకర గుణాలే ఇందుకు కారణమని ఆయన అన్నారు. దీనిఇని పెద్ద ఎత్తున జరుగుతున్న ఉత్పత్తిగా కాక, పెద్ద సంఖ్యలో ప్రజలు చేపడుతున్న విప్లవాత్మక ఉత్పత్తి గా చూడాలని అన్నారు.గ్రామాల స్వావలంబనకు ఖాదీ ఒక ఉపకరణంగా ఎలా ఉపయోగపడుతుందో మహాత్మాగాంధీ ఏనాడో గుర్తించారని,   మహాత్ముడి ఆశయాలనుంచి ప్రేరణ పొంది ఆత్మనిర్భర్ భారత్ వైపు కృషి చేస్తున్నామన్నారు. స్వదేశీ ఉద్యమానికి తమిళనాడు కీలక కేంద్రంగా ఉందని అంటూ ప్రధానమంత్రి, ఆత్మనిర్భర్ భారత్ లోనూ తమిళనాడు, మరోసారి కీలక పాత్ర పోషించనున్నదన్నారు.
.మహాత్మాగాంధీ ప్రవచించిన గ్రామీణాభివృద్ధి దార్శనికతను అర్థంచేసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. గ్రామీణ జీవితపు విలువలను కాపాడుకుంటూ గ్రామాలు అభివృద్ధి సాధించాలని తాను కోరుకుంటున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. మహాత్మాగాంధీ ఆదర్శాలనుంచి గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రేరణపొందుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. పట్టణ , గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా , అంతరాలు లేనంతవరకు ఆమోదయోగ్యమేనని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పూర్తి పారిశుధ్య కవరేజ్ కి సంబంధించి తగిన ఉదాహరణలిస్తూ ప్రధానమంత్రి, ఆరు కోట్ల ఇళ్లకు కుళాయి ద్వారా నీటిని అందిస్తున్నామని, 2.5 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ అందిస్తున్నామని, రోడ్ల నిర్మాణం ద్వారా  గ్రామీణ అనుసంధానత కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకు అభివృద్ధిని తీసుకువెళుతున్నదని ఆయన చెప్పారు. దీనిద్వారా పట్టణప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరం తొలగిపోయిందని అన్నారు.

పారిశుధ్యం అనేది మహాత్మాగాంధీ మనసుకు అత్యంత దగ్గరైనదని అంటూ ప్రధానమంత్రి, స్వచ్ఛ భారత్ ఉదాహరణ గురించి ప్రస్తావించారు.  గ్రామాలకు మౌలిక సదుపాయాలను కల్పించడాన్ని ఎక్కడా ఆపడం లేదని, ఆధునిక సైన్స్, టెక్నాలజీ ప్రయోజనాలను గ్రామాలకు అందిస్తున్నామన్నారు. 6 లక్షల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ను 2 లక్షల గ్రామ
పంచాయితీలను అనుసంధానం చేసేందుకు వేసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో సుస్థిరత అవసరతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇలాంటి రంగాలలో యువత నాయకత్వాన్ని అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్తుకు సుస్థిర వ్యవసాయం ఆవశ్యకమైనదని ప్రధానమంత్రి అన్నారు.మన ఆర్గానిక్ వ్యవసాయ పథకం అద్భుతాలు
సృష్టిస్తున్నదని,ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలలో ఇది మంచి ఫలితాలనిస్తున్నదన్నారు. గత ఏడాది బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని ప్రధానమంత్రి చెప్పారు. వ్యవసాయాన్ని మోనో కల్చర్ నుంచి  రక్షించాల్సిన అవసరం ఉందని, నూతన వంగడాలు, చిరుధాన్యాలు ఇతర పంటలను
పండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆచార్య వినోభా బావే మాటలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, గ్రామస్థాయి సంస్థలకు జరిగే ఎన్నికలు విభజనకు దారితీసే విధంగా ఉండకూడదన్నారు. గుజరాత్లో ప్రారంభించిన సమరస్ గ్రామ యోజనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏకాభిప్రాయంతో గ్రామ స్థాయి నాయకత్వాన్ని ఎన్నుకునే గ్రామాలకు కొన్ని రకాల
ప్రోత్సాహకాలను ఇవ్వాలని, ఇది  సామాజిక ఉద్రిక్తతలను సడలిస్తుందని అన్నారు.గాంధీజీని కళ్లారా చూడడానికి మహాత్ముడు ప్రయాణిస్తున్న రైలు వద్దకు వేలాది మంది గ్రామస్థులు తరలి వచ్చేవారిన అంటూ ప్రధానమంత్రి, మహాత్మాగాంధీ ఐక్య, స్వతంత్రభారతావని కోసం పోరాడారని అన్నారు. గాంధీగ్రామ్ భారతదేశ ఐక్యతకు గాంధీగ్రామ్  గాథ నిదర్శనమని, ఆయన అన్నారు. తమిళనాడు ఎప్పుడూ జాతిచైతన్యానికి పుట్టినిల్లుగా ఉంటూ వస్తున్నదని అంటూ ప్రధానమంత్రి, స్వామి వివేకానందుడు
పశ్చిమదేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చినపుడు ఆయనకు అద్భుతంగా స్వాగతం పలికిందని అన్నారు.దివంగత జనరల్ బిపిన్ రావత్ మాటలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి వీర వణక్కం నినాదాలను గుర్తుచేశారు.

త్వరలోనే  కాశీలో జరగనున్న కాశీ తమిళ్ సంగమం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.ఇది కాశీ–తమిళనాడు ల మధ్య బంధాన్ని ఉత్సవంగా జరుపుకుంటుందని అన్నారు. ఏక్భారత్–శ్రేష్ఠ్ భారత్ కార్యాచరణకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రేమ, పరస్పర గౌరవం మన దేశ ఐక్యతకు పునాది అని ప్రధానమంత్రి అన్నారు.
రాణి వెలునాచియార్ త్యాగాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,బ్రిటిష్ వారితో పోరాట సమయంలో ఆమె ఇక్కడ నివశించారన్నారు. నారీ శక్తిని ప్రదర్శించిన గడ్డపై తాను ఈరోజు ఉన్నానని ప్రధానమంత్రి అన్నారు. ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న మహిళలు మార్పుకు కారకులు కానున్నారన్నారు. గ్రామీణ మహిళలు విజయం సాధించడానికి ఈ మహిళా గ్రాడ్యుయేట్లు తోడ్పడగలరన్నారు. వీరి విజయం దేశ విజయమని ప్రధానమంత్రి చెప్పారు.

ప్రపంచం అత్యంత సంక్షోభకర పరిస్థితులలో ఉన్నప్పుడు దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం లేదా పేదలకు ఆహార భద్రతా కార్యక్రమం , లేదా ప్రపంచ వృద్ధికి గ్రోత్ ఇంజిన్ గా ఉండడం ఇండియాకే సాధ్యమైందని అన్నారు. ‘‘ఇండియా అద్భుతాలు సృష్టించాలని ప్రపంచం ఆశిస్తున్నదని, అందువల్ల భారత్ భవిష్యత్తు, మేం సాధించగలం అన్న యువతరం చేతులలో ఉన్నదని’’ అన్నారు. యువత సవాళ్లను స్వీకరించడమే కాదు, వాటిని ఆస్వాదించగలదని కూడా ఆయన అన్నారు.
ప్రశ్నించడమేకాదు, వాటికి సమాధానాలను కూడా సాధించగల సత్తా యువత సొంతం.భయరహితులే కాదు, అలుపులేకుండా పనిచేయగల సత్తా వారికి ఉంది. ఆకాంక్షించడమేకాదు సాధించడం కూడా వారి సొంతం ’’అని ప్రధానమంత్రి  యువతనుద్దేశించి అన్నారు.“ఈ గ్రాడ్యుయేషన్ ఉత్సవం సందర్బంగా యువతకు నా సందేశం– మీరు నవభారత నిర్మాతలు. రాగల 25 సంవత్సరాల అమృత్ కాల్ లో దేశాన్ని ముందుకు నడిపించే బృహత్తర బాధ్యత మీదే ’’అని ప్రధానమంత్రి అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్, తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్, ఛాన్సలర్ డాక్టర్ కె.ఎం. అన్నామలై, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గుర్మీత్ సింగ్ ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.