Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ త‌మిళ‌నాడులోని చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం కొత్త సమీకృత టెర్మిన‌ల్ భవనం (ఫేజ్-1) ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ప్రయాణికుల కోసం కల్పించిన సదుపాయాలను కూడా ఆయన పరిశీలించారు.

దీనిపై ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

“చెన్నై విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనం ఈ గొప్ప నగర ప్రజలతోపాటు తమిళనాడు రాష్ట్రం మొత్తానికీ గర్వకారణం. ఈ భవన నిర్మాణంలో ఘనమైన తమిళనాడు  సంస్కృతి ప్రతిఫలిస్తోంది ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

p style=”text-align:justify”> 

   చెన్నై విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్‌ను రూ.1260 కోట్లతో నిర్మించారు. దీంతో విమానాశ్రయ ప్రయాణికుల వార్షిక నిర్వహణ సామర్థ్యం ఏటా 23 మిలియన్ల (ఎంపీపీఏ) నుంచి 30 మిలియన్ల స్థాయికి పెరుగుతుంది. తమిళ సంస్కృతి-సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కొత్త టెర్మినల్‌ నిర్మితమైంది. ఈ మేరకు ముగ్గులు, చీరలు, దేవాలయాలు తదితర అంశాలతో ఇక్కడి సహజ పరిసరాలను ప్రతిబింబించేలా భవనం రూపొందింది.

   ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని వెంట తమిళనాడు గవర్నర్‌ శ్రీ ఆర్‌.ఎన్‌.రవి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ శాఖ, సమాచార-ప్రసార మంత్రిత్వశాఖల సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

***

DS/TS