జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా… పౌరులందరికీ అధిక నాణ్యత, తక్కువ ఖర్చులో లభించే మందులను అందజేస్తూ ఆరోగ్యభరితమైన, దృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ప్రజలకు నాణ్యమైన మందులను, తక్కువ ధరలకు అందించాలని, ఆరోగ్యభరితమైన, దృఢమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న మా నిబద్ధతకు జన్ ఔషధి దినోత్సవం (#JanAushadhiDiwas) అద్దంపడుతోంది. ఈ దిశగా తీసుకొన్న చర్యలను ఈ లింకు తెలియజేస్తోంది’’
#JanAushadhiDiwas reflects our commitment to provide top quality and affordable medicines to people, ensuring a healthy and fit India. This thread offers a glimpse of the ground covered in this direction… https://t.co/2oUskQvrda
— Narendra Modi (@narendramodi) March 7, 2025