ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం విద్యుత్త్తు ధరల విధానాన్ని సవరించాలన్న కేంద్ర విద్యుత్తు శాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విద్యుత్తు రంగంలో సమూల మార్పులు తీసుకురావడంపై సమగ్ర ఆలోచన చేసి, 2006 నాటి పవర్ టారిఫ్ పాలసీలో సమగ్ర సవరణలకు తెర తీయడం ఇదే మొట్టమొదటి సారి. నాలుగు ఇ లను ( 4 Es) పరిపూర్తి చేయడానికి ఉద్దేశించిన ఉజ్జ్వల్ డిస్కం అష్యూరెన్స్ యోజన (యూడీఏఐ.. ఉదయ్) లక్ష్యాలను అందుకోవడం కోసం కూడా ఈ సవరణలను ప్రతిపాదించడం జరిగింది. ప్రతి ఒక్కరికీ విద్యుత్తు (Electricity for all), ఖర్చును భరించగల స్థాయిలో టారిఫ్‌ల నిర్ణయ సామర్థ్యం (Efficiency to ensure affordable tariffs), భవిష్యత్తు మనుగడ కోసం వాతావరణ కల్పన (Environment for a sustainable future), పెట్టుబడుల ఆకర్షణ, స్వీయ ఆర్థిక శక్తికి సంబంధించిన ప్రక్రియను సులభతరం చేయడం (Ease of doing business to attract investments and ensure financial viability) .. ఇవే నాలుగు ఇ లు ( 4 Es).
సవరణల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి ..:
విద్యుత్తు
• ప్రతి వినియోగదారుకు 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు సరఫరా విషయంలో విక్షేప మార్గాన్ని కనుగొనాలి.
• బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన మారుమూల గ్రామాలను సూక్ష్మ గ్రిడ్‌ల ద్వారా విద్యుదీకరించాలి. దానికోసం ఈ గ్రిడ్‌లకు అవసరమైన విద్యుత్తును కొనుగోలు చేసి, సరఫరా చేయాలి.
• బొగ్గు గనుల ప్రాంతానికి దగ్గరగా ఆవాసాలు కలిగిన ప్రజలకు చౌకగా విద్యుత్‌ని ఇవ్వాలి. దానికోసం కోల్ వాషరీ రిజెక్ట్ బేస్ డ్ ప్లాంట్‌ల నుంచి కరెంటును సేకరించాలి.
సామర్థ్యం
• వినియోగదారుపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి. దానికోసం ప్రస్తుతం ఉన్న విద్యుత్ ప్లాంట్లను మరింతగా విస్తరించాలి.
• విద్యుత్ రంగంపై పెట్టే ఖర్చులను కుదించాలి. దానికోసం వినియోంచుకోగా మిగిలిపోయిన విద్యుత్తును బయట అమ్మి, తద్వారా మొత్తంమీద విద్యుత్తు ఖర్చును తగ్గించుకోవాలి.
• వేగంగానూ, తక్కువ వ్యయ ప్రయాసలతోనూ సేవలు అందించేలా పంపిణీ వ్యవస్థని మెరుగుపరచాలి. దాని కోసం తగిన స్పర్ధాత్మక బిడ్డింగ్ ప్రక్రియను చేపట్టాలి.
• విద్యుత్తు చౌర్యాన్ని తగ్గించి, నెట్- మీటరింగ్ ద్వారా “టైమ్ ఆఫ్ డే” మీటరింగ్ లక్ష్యాన్ని అందుకోవాలి. దానికోసం స్మార్ట్ మీటర్లను అతి త్వరితంగా బిగించాలి.
• విద్యుత్తు తయారీ, సరఫరా ఖర్చులను బాగా తగ్గించుకోవాలి. దానికోసం దేశంలోని ప్రతి మూలకు అందేలా పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాలి.
వాతావరణం
• పునర్ వినియోగ విద్యుత్ విధానం (రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్.. ఆర్‌పీవో): 2022 మార్చి నాటికి మొత్తం విద్యుత్తు వినియోగంలో సౌర విద్యుత్తు పరిమాణాన్ని 8 శాతానికి (జల విద్యుత్తు మినహా) పెంచాలి. దానికోసం పునర్ వినియోగ విద్యుత్తు తయారీ, భద్రత విధానాన్ని ప్రోత్సహించాలి.
• పునర్ విద్యుత్తు తయారీ విధానం(రెన్యూవబుల్ జనరేషన్ ఆబ్లిగేషన్.. ఆర్‌జీవో): నిర్దేశిత గడువు లోగా బొగ్గు లేక లిగ్నైట్ ఆధారిత థర్మల్ ప్లాంట్లను పునర్ తయారీ సామర్థ్యం లేక సేకరణ, కొనుగోలు, వ్యవస్థీకరణ శక్తితో కొత్తగా నెలకొల్పాలి.
• పీపీఏలు పూర్తి అయిన, వినియోగ కాలం చెల్లిపోయిన ప్లాంట్ల నుంచి పునర్ వినియోగ విద్యుత్‌ని తక్కువ ఖర్చుతో పొందాలి.
• గాలి మరల ద్వారా, ఇంకా సౌర శక్తి వినియోగం ద్వారా తయారు చేసే విద్యుత్తుపై అంతర్ రాష్ట్ర పంపిణీ చార్జీలు, లోటు భారాలు మోపరాదు.
• వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారుచేసే ప్లాంట్ల నుంచి 100 శాతం సేకరణ జరపడం ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గొప్ప ఊపును తీసుకురావచ్చు.
• నగరాలకు మంచినీటిని అందించడం, గంగానది వంటి నదుల్లో పేరుకుపోయిన కాలుష్యాన్ని నియంత్రించడం కోసం.. మురుగు శుద్ధి కేంద్రాలకు 50 కిలోమీటర్ల దూరంలోని థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ తయారీకి ఆ శుద్ధి చేసిన జలాలను ఉపయోగించాలి.
• దీర్ఘకాలిక పీపీఏ విధానం ద్వారా హైడ్రో ప్రాజెక్టులను ప్రోత్సహించాలి. దానికోసం 2022 వరకు స్పర్ధాత్మక బిడ్డింగ్‌ల నుంచి మినహాయింపు ఇవ్వాలి.
• పునర్ వినియోగ విద్యుత్ ప్రక్రియ విస్తరణలో భాగంగా గ్రిడ్ కార్యకలాపాలను పెంచడానికి వీలుగా ఆనుషంగిక సేవలను అందించాలి.
లావాదేవీల సులభతరం
• పెద్ద ఎత్తున బొగ్గు నిల్వల కలిగిన ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలి. నిర్దేశించిన టారిఫ్ మేరకు 35 శాతం విద్యుత్తును డిస్కంలు సేకరించేలాగా, ప్లాంట్ల ఏర్పాటుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతులు మంజూరు చేయాలి.
• డొమెస్టిక్ డ్యూటీలు, లెవీలు, సెస్, స్పర్ధాత్మక బిడ్ ప్రాజెక్టులకు వసూలు చేసే సుంకాల రూపంలో తలెత్తే మార్కెట్ అస్థిమిత స్థితిని తొలగించాలి.
• ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు విక్రయించే విద్యుత్తు రేట్లను నిర్దేశించే టారిఫ్ ఖరారు వ్యవస్థ పట్ల ఉదారత అవసరం. 10 శాతం కన్నా ఎక్కువగా బయట రాష్ట్రానికి విక్రయించే సందర్భంలో టారిఫ్ ఉభయతారకంగా ఉండేలా చూడటానికి కేంద్ర నియంత్రణ వ్యవస్థ అవసరం.
ఈ సవరణల అమలుతో వినియోగదారు బహుళ ప్రయోజనాలు పొందుతాడు. సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా విద్యుత్తు వ్యయం బాగా తగ్గిపోతుంది. పునర్ వినియోగ విద్యుత్తుతో వాతావరణం తేటపడి, తనకు గల శక్తి వనరుల భద్రతను కాపాడుకోవడానికి దేశానికి దోహదకారి అవుతాయి. వ్యర్థాల నుంచి, మురుగు జలాల నుంచి విద్యుత్తును తయారు చేయడం, ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో పాటు నమామీ గంగా మిషన్‌కీ దోహదపడటం కూడా ఈ సవరణల లక్ష్యాల్లో ఒకటి. దీనివల్ల తాగు, సాగు అవసరాలకు సరిపడా స్వచ్ఛ జలం అందుబాటులోకి వస్తుంది.
పోటీ పద్ధతుల్లో, సరసమైన ధరలకు వినియోగదారుకు విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. విద్యుత్తు రంగంలో ఆర్థిక స్వీయ సామర్థ్యాన్ని పెంపొందించుకొనే వీలు కలుగుతుంది. పెట్టుబడులను ఆకర్షించడం, పారదర్శకతని సాధించడం, తన పరిధుల్లోని నియంత్రణ విధానాల్లో నిలకడని, భవిష్య దృష్టిని పెంపొందించడం సులభం అవుతుంది. అంతేకాదు, పోటీతత్వాన్ని పెంచుతుంది. నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. సరఫరా చేసే విద్యుత్తు నాణ్యతను మెరుగుపరుస్తుంది. 24 గంటల నిరంతరాయ, ఖర్చులను భరింప వీలు అయిన విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలనేది గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక స్వప్నం. ఈ కలను నిజం చేయడం కోసమే ఉదయ్ వంటి పథకాలను రూపొందించారు. టారిఫ్ విధానానికి సమగ్ర పద్ధతుల్లో సవరణలు తీసుకురావడం ద్వారా ఇలాంటి పథకాలకు పుష్టి చేకూరుతుంది.
Cabinet approves amendments in Power Tariff Policy to ensure 24X7 affordable Power for all. https://t.co/QYJl6xDAWe
— PMO India (@PMOIndia) January 20, 2016