Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ మెట్రో కారిడోర్ ను దిల్శాద్ గార్డెన్ నుండి న్యూ బ‌స్ అడ్డా గాజియాబాద్ వ‌ర‌కు విస్త‌రించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ఢిల్లీ మెట్రో కారిడోర్ ను దిల్శాద్ గార్డెన్ నుండి న్యూ బ‌స్ అడ్డా గాజియాబాద్ వ‌ర‌కు విస్త‌రించేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది. విస్త‌రించిన మార్గం మొత్తం దూరం 9.41 కి.మీ. లు గా ఉంటుంది. ఈ ప‌నికి గాను 324.87 కోట్ల రూపాయ‌ల‌ ను కేంద్రం పక్షాన ఆర్థిక స‌హాయం గా స‌మ‌కూర్చేందుకు కూడా మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీనితో కలుపుకొని 1,781.21 కోట్ల రూపాయ‌ల మొత్తం వ్యయం తో ఈ ప‌ని ని పూర్తి చేయనున్నారు.

ఈ ప‌థ‌కం అమ‌లులోకి వస్తే ఎన్‌సిఆర్ కు అత్యంత అవసరమైనటువంటి అద‌న‌పు ప్ర‌జా ర‌వాణా, మౌలిక స‌దుపాయాలు అందుబాటు లోకి రాగ‌ల‌వు.

భార‌త ప్ర‌భుత్వం మ‌రియు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ నేశ‌న‌ల్ కేపిట‌ల్ టెరిట‌రీ ఆఫ్ ఢిల్లీ (జిఎన్‌సిటిడి) లు ఒక ప్రత్యేక ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన కంపెనీ (ఎస్‌పివి) అయినటువంటి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేశన్ లిమిటెడ్ (డిఎమ్ఆర్ సి) ఈ ప్రాజెక్టు కు కార్యరూపం కల్పిస్తోంది.

***