ఢిల్లీ కంటోన్మెంట్ లోని కంధార్ లైన్స్ లో కేంద్రీయ విద్యాలయ నంబర్ 4 నిర్మాణం కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్)కు ఒక్కొక్క సంవత్సరానికి ఒక రూపాయి నామమాత్రపు అద్దె కు నాలుగు ఎకరాల రక్షణ రంగ భూమి ని శాశ్వత ప్రాతిపదికన లీజుపై బదలాయించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
పూర్వరంగం:
ఢిల్లీ కంటోన్మెంట్ లోని కేంద్రీయ విద్యాలయ నంబర్ 4 యొక్క నిర్వహణ ఢిల్లీ కంటోన్మెంట్ యొక్క సర్వే నంబర్ 14 భవనంలో తాత్కాలికంగా జరుగుతోంది. దీనిని 1994 లో ఏర్పాటు చేయడమైంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 956 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ద్వారా సొంత శాశ్వత పాఠశాల భవనం నిర్మాణం జరిగితే విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో పాటు పూర్వ సైనికోద్యోగుల కుటుంబాలు, ఇంకా ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతం, పరిసర ప్రాంతాల పౌరుల పిల్లలకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడినటువంటి సముచితమైన, విద్యోపయుక్తమైన వాతావరణం నెలకొంటుంది.