Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్’లో కొలువుదీరిన ఈశాన్య రాష్ట్రాల జౌళి రంగ వైవిధ్యం,


కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకొన్నారు. దేశ ఈశాన్య రాష్ట్రాల జౌళి రంగ వైవిధ్యాన్ని, పర్యాటక అవకాశాల్ని, సాంప్రదాయక చేతివృత్తుల పనితనాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్న అష్టలక్ష్మి మహోత్సవ్ వైభవోపేతంగా ప్రదర్శిస్తోందని ప్రధాని అన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) హ్యాండిల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఈ కింది విధంగా పేర్కొంది:

‘‘కనెక్టివిటీలో మెరుగుదల, సేవలను డిజిటల్ మాధ్యమం అండదండలతో సమాజంలో అన్ని వర్గాల చెంతకూ  చేర్చడం, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను పెంచడం వంటి విధానాలను అనుసరిస్తూ దేశ ఈశాన్య ప్రాంతాలు ప్రశంసనీయ వృద్ధిని సాధిస్తున్నాయని కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియా (@JM_Scindia) విపులంగా వివరించారు. దేశ ఈశాన్య రాష్ట్రాల వస్త్ర రంగ వైవిధ్యాన్ని, పర్యాటక అవకాశాల్ని, సాంప్రదాయక చేతివృత్తుల పనితనాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్న అష్టలక్ష్మి మహోత్సవ్ గొప్పగా చాటిచెబుతోంది’’.

 

 

***

MJPS/SR