Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘డెస్టినేశ‌న్ ఉత్తరాఖండ్: ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దెహ్‌రాదూన్ లో నేడు జ‌రిగిన ‘డెస్టినేశ‌న్ ఉత్తరాఖండ్: ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ 2018’ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

భార‌త‌దేశం శ‌ర వేగంగా ప‌రివ‌ర్త‌న చోటు చేసుకొంటున్న కాలం గుండా ప్ర‌యాణిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. రానున్న ద‌శాబ్దాల లో ప్ర‌పంచ వృద్ధి కి ప్ర‌ధానమైన చోద‌క శ‌క్తి గా భార‌త‌దేశం ఉంటుంద‌న్న విష‌యాన్ని చాలా మంది ఆమోదిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశం లో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల యొక్క వేగం మరియు స్థాయి ఇదివ‌ర‌కు ఎరుగ‌ని విధంగా ఉన్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. వ్యాపారం సౌల‌భ్యం తాలూకు బ్యాంకింగ్ ల‌లో భార‌త‌దేశం యొక్క స్థానం 42 మెట్లు ఎగ‌సిన‌ట్లు ఆయ‌న ప్ర‌స్తావించారు. ప‌న్నుల విధానం లో తీసుకు వ‌చ్చిన సంస్క‌ర‌ణ‌ ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ఇన్‌సోల్వన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సీ కోడ్ వ‌ల్ల వ్యాపారం చేయ‌డం సుల‌భ‌త‌రం అయింద‌ని ఆయ‌న అన్నారు.

జిఎస్‌టి ని అమ‌లుప‌ర‌చ‌డం స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాతి కాలం లో చోటు చేసుకొన్న అతి పెద్ద ప‌న్నుల సంబంధిత సంస్క‌ర‌ణ అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఇది దేశాన్ని ఒకే ఒక విప‌ణి గా మార్చి వేయడమే కాక ప‌న్నుల పునాదిని పెంచ‌డం లో స‌హాయ‌కారి గా కూడా నిల‌చింద‌ని ఆయ‌న వివ‌రించారు.

మౌలిక స‌దుపాయాల రంగం శర వేగంగా పురోగ‌మిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ర‌హ‌దారుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం, కొత్త మెట్రో వ్య‌వ‌స్థ లు, హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు లతో పాటు డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్‌ వేగవంతం అయిన విష‌యాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. అలాగే విమాన‌యాన రంగం తో పాటు గృహ నిర్మాణం, విద్యుత్తు, స్వ‌చ్ఛ ఇంధ‌నం, ఆరోగ్యం ల‌తో పాటు, ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ సేవ‌ల లోని పురోగ‌తి ని కూడా ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కం రెండో అంచె నగరాలలోను, మూడో అంచె న‌గ‌రాల లోను వైద్య సంబంధిత మౌలిక స‌దుపాయాల అభివృద్ధి కి ఊతాన్ని అందించ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.

‘న్యూ ఇండియా’ పెట్టుబ‌డుల కు ఒక ప్ర‌ముఖ గ‌మ్య స్థానం గా ఉంటుంద‌ని, ఈ స్ఫూర్తి కి ‘‘డెస్టినేశన్ ఉత్త‌రాఖండ్‌’’ ప్రాతినిధ్యం వ‌హిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో ఇన్వెస్ట‌ర్ సౌల‌భ్యం కోసం తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రం లో చార్‌-ధామ్ లో అన్ని రుతువు ల‌లో ప్ర‌యాణించేందుకు అనువైన ర‌హ‌దారి ప‌థ‌కం తో పాటు రుషికేశ్- క‌ర్ణ‌ప్ర‌యాగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు లు స‌హా సంధానాన్ని మెరుగుప‌ర‌చ‌డం కోసం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ లో పురోగ‌తిని గురించి కూడా ఆయ‌న వివ‌రించారు. ప‌ర్య‌ట‌న రంగం లో రాష్ట్రం లో అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

ఫూడ్ ప్రాసెసింగ్, ఇంకా న‌వీక‌ర‌ణీయ శ‌క్తి రంగాల లో చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ ను ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్య‌క్ర‌మం యొక్క సాఫ‌ల్యాల‌ ను గురించి కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగం లో ప్ర‌స్తావించారు.

***