మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా ఈ నెల 25న ప్రధానమ్రంతి శ్రీ నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గం.లకు ఖజురహోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు.
జాతీయ దృక్పథ ప్రణాళికలో భాగంగా దేశంలో మొట్టమొదటి నదీ అనుసంధాన కార్యక్రమమైన కెన్ – బెత్వా నదుల జాతీయ అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచి, లక్షలాది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. వీటితో పాటు నిర్మించే జలవిద్యుత్ కేంద్రాలు 100 మెగావాట్ల కంటే ఎక్కువ హరిత విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాజెక్టు అనేక ఉద్యోగావకాశాలను కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా స్మారక తపాలాబిళ్ల, నాణేలను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. అలాగే 1153 అటల్ సుశాసన్ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రాంతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు సుపరిపాలన అందించేలా విధులు, బాధ్యతలు నిర్వహించడంలో ఈ భవనాలు కీలకపాత్ర పోషిస్తాయి.
ఇంధన సమృద్ధి సాధించడంతో పాటు హరిత విద్యుత్తును ప్రోత్సహించే విషయంలో తన అంకితభావానికి నిదర్శనంగా మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఉన్న ఓంకారేశ్వర్‌లో నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టు కర్భన ఉద్ఘారాలను తగ్గించి 2027 నాటికి సున్నా కర్భన ఉద్ఘారాలను సాధించాలనే ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడుతుంది. అలాగే నీరు ఆవిరి కాకుండా చేసి జల సంరక్షణలోనూ సహాయపడుతుంది.
***