Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబర్ 16 న జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణిమ్ విజయ్ మశాల్స్కు శ్రద్ధాంజలి మరియు స్వాగత కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 16 న ఉదయం పూట 10:30 గంటల వేళ లో జాతీయ యుద్ధ స్మారకం లో స్వర్ణిమ్ విజయ్ కాగడాల కు శ్రద్ధాంజలి మరియు స్వాగత కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

 

భారతదేశం 1971 వ సంవత్సరం లో జరిగిన యుద్ధం లో గెలవడం మరియు బాంగ్లాదేశ్ స్థాపన కు 50 సంవత్సరాలు అయిన సందర్భాన్ని స్మరించుకోవడం కోసం నిర్వహించినటువంటి స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమం లో ఒక భాగం గా, కిందటి సంవత్సరం లో డిసెంబర్ 16 నాడు ప్రధాన మంత్రి జాతీయ యుద్ధ స్మారకం లో గల అనంత జ్యోతి నుంచి స్వర్ణిమ్ విజయ్ మశాల్ (కాగడా) ను వెలిగించారు. వేరు వేరు దిక్కుల కు తీసుకు పోవలసి ఉన్న నాలుగు కాగడాల ను కూడా ఆయన వెలిగించారు. అది మొదలు, ఆ నాలుగు కాగడాల ను సియాచిన్, కన్యాకుమారి, అండమాన్ & నికోబార్ దీవులు, లోంగేవాలా, కచ్ఛ్ కు చెందిన రణ్, అగర్ తలా మొదలైన ప్రాంతాలు సహా దేశం లో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లడమైంది. ఈ అగ్నుల ను ముఖ్యమైన యుద్ధ ప్రాంతాల కు, అదే విధం గా శౌర్య పురస్కార విజేతల ఇళ్ల కు, ఇంకా 1971 యుద్ధం లో పాల్గొన్న చిరకాల అనుభవం కలిగిన వ్యక్తుల ఇళ్ళ కు కూడాను తీసుకు పోవడం జరిగింది.

 

2021 డిసెంబర్ 16 న జరుగనున్న శ్రద్ధాంజలి కార్యక్రమం లో భాగం గా, ఈ నాలుగు అగ్నుల ను జాతీయ యుద్ధ స్మారకం లో గల నిత్య జ్యోతి లో ప్రధాన మంత్రి కలిపివేస్తారు.

 

***