Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీల లో దిల్లీ లో జరుగనున్న ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షతవహించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 28 వ తేదీ మరియు 29 వ తేదీ లలో దిల్లీ లో ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు. ఈ తరహా సమావేశాన్ని నిర్వహించడం ఇది మూడో సారి. ఒకటో సమావేశాన్ని 2022 వ సంవత్సరం జూన్ లో ధర్మశాల లో మరియు రెండో సమావేశాన్ని 2023 జనవరి లో దిల్లీ లో నిర్వహించడమైంది.

సహకార పూర్వకమైన సమాఖ్య వాదం సిద్ధాంతాన్ని ఆచరణ లో పెట్టాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణం నుండి ప్రేరణ ను పొంది, ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వాని కి మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు మధ్య ప్రాతినిధ్య ప్రధాన పాలన ను మరియు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈ సమావేశాల ను నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం లో, ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశం డిసెంబరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ మధ్య నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం లో కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర సీనియర్ అధికారులు సహా రెండు వంద ల మంది కి పైగా పాలుపంచుకొంటారు. ప్రభుత్వ పథకాల అందజేత యంత్రాంగాన్ని పటిష్ట పరచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల లో మరియు పట్టణ ప్రాంతాల లో జనాభా కు జీవించడం లో మరింత ఉత్తమమైన నాణ్యతను ఇవ్వడం అనే లక్ష్యం తో సహకార పూర్వకమైన కార్యాచరణ కు అనువు గా రంగాన్ని సిద్ధం చేయడం ఈ సమావేశాల లో జరుగనుంది.

ఈ సంవత్సరం ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశాల లో ప్రధానం గా జీవన సౌలభ్యంఅంశం పై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశాలు ఒక ఉమ్మడి అభివృద్ధి అజెండా రూపకల్పన కు మరియు అమలు కు ప్రాధాన్యాన్ని ఇస్తూ, రాష్ట్రాల భాగస్వామ్యం తో ఒక పొందికైనటువంటి కార్యాచరణ కై నమూనా ను రూపొందిస్తుంది.

సంక్షేమ పథకాల ను సులభమైన రీతి లో ప్రాప్తింపచేయడం పైన మరియు సేవ ల అందజేత లో నాణ్యత పైన ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటూ, అయిదు ఉప ఇతివృత్తాల ను గురించి సమావేశం లో చర్చించడం జరుగుతుంది. ఆ ఉప ఇతివృత్తాల లో భూమి & సంపత్తి, విద్యుత్తు, త్రాగునీరు, ఆరోగ్యం మరియు పాఠశాల విద్య లు ఉంటాయి. వీటి కి అదనం గా, సైబర్ సెక్యూరిటీ: ఇమర్జింగ్ చాలింజెస్; పర్స్‌ పెక్టివ్స్ ఆన్ ఎఐ; స్టోరీస్ ఫ్రమ్ ద గ్రౌండ్: యాస్పైరేశనల్ బ్లాక్ & డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్; రోల్ ఆఫ్ స్టేట్స్: రేశనలైజేశన్ ఆఫ్ స్కీమ్స్ & అటానమస్ ఎన్‌టిటిస్ ఎండ్ ఇన్‌ హాన్సింగ్ కేపిటల్ ఎక్స్‌ పెండిచర్; ఎఐ ఇన్ గవర్నెన్స్, చేలింజెస్ & ఆపర్చునిటీస్ అంశాల పైన కూడా ప్రత్యేక సదస్సుల ను నిర్వహించడం జరుగుతుంది.

వీటికి తోడు, మత్తు పదార్థాల వినియోగం బారి న పడ్డ బాధితుల ను కాపాడడం, వారి ని సాధారణ జన జీవన స్రవంతి లోకి తీసుకు రావడం; అమృత్ సరోవరాలు; పర్యటన రంగాని కి ప్రోత్సాహం, బ్రాండింగ్ & రోల్ ఆఫ్ స్టేట్స్; మరియు పిఎమ్ విశ్వకర్మ యోజన & పిఎమ్ స్వనిధి అనే అంశాల పైన చర్చోపచర్చలు జరుగనున్నాయి. ఈ ఇతివృత్తాల లో ఒక్కోదాని లో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అవలంబిస్తున్నటువంటి ఉత్తమ అభ్యాసాల ను కూడా సమావేశం లో నివేదించనున్నారు. తత్ఫలితం గా రాష్ట్రాలు ఒక రాష్ట్రం లో సఫలం అయినటువంటి పరిణామాల ను వాటి వాటి అవసరాల కు అనుగుణం గా మార్పు చేర్పుల ను చేసుకొని తాము సైతం ఆచరణ లో పెట్టేందుకు వీలు చిక్కుతుంది.

 

***