Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబరు 23న న్యూ ఢిల్లీలో సీబీసీఐ సెంటర్‌లో కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రిస్‌మస్ వేడుకలు: హాజరుకానున్న ప్రధానమంత్రి


కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఆధ్వర్యంలో డిసెంబరు 23న సాయత్రం ఆరున్నర గంటలకు న్యూ ఢిల్లీలో సీబీసీఐ సెంటర్‌లో నిర్వహించనున్న క్రిస్‌మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

క్రైస్తవ సమాజానికి చెందిన ప్రముఖ నేతలతో ప్రధాని మాట్లాడనున్నారు. వీరిలో కార్డినల్స్, బిషప్స్‌తో పాటు చర్చికి చెందిన ప్రముఖ నేతలు కూడా ఉంటారు.

భారతదేశంలో కేథలిక్ చర్చి ప్రధానకేంద్రంలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటుండడం ఇది మొదటిసారి.

కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ)ని 1944లో స్థాపించారు. ఈ సంస్థ భారతదేశమంతటా కేథలిక్‌లందరితో కలిసి పనిచేస్తోంది.