Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబరు 17న రాజస్థాన్‌లో ప్రధానమంత్రి పర్యటన


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 17న రాజస్థాన్‌లో పర్యటించనున్నారురాజస్థాన్‌ ప్రభుత్వం ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్ వర్ష్ – పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.  రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇంధనంరహదారులురైల్వేలునీటికి సంబంధించినరూ.46,300 కోట్లకు పైగా విలువైన 24 ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు చేయనున్నారు.

 

ప్రధానమంత్రి రూ.11,000 కోట్లకన్నా ఎక్కువ విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారువీటిలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులున్నాయిఆయన రూ.35,300 కోట్లకు పైగా విలువైన 15 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారుఈ ప్రాజెక్టులలో ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులుఇవి కాకుండా మరో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి

 

ఈ కార్యక్రమం వేదికగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో నవ్‌నేరా ఆనకట్టస్మార్ట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ అండ్ అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టులుభీల్‌డీ– సమ్‌దడీలూనీజోధ్‌పూర్ – మెడ్‌తా రోడ్– – డేగానా– రతన్‌గఢ్ సెక్షన్ రైలుమార్గ విద్యుదీకరణతోపాటు ఢిల్లీ– వడోదరా గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్ కు చెందిన ప్యాకేజ్ 12 (ఎన్‌హెచ్-148ఎన్)భాగంగా ఉన్నాయి.  మేజ్ నది పైన ప్రధాన వంతెన ప్రాజెక్టు  సహా జంక్షన్ వరకు ఉన్న ప్రాజెక్టు (ఎస్‌హెచ్-37)లో మరో భాగం సైతం ప్రాజెక్టుల్లో భాగంగా ఉందిఈ ప్రాజెక్టులు ప్రజలకు సులభమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావడంలోప్రధానమంత్రి సూచించిన హరిత ఇంధన సాధన ఆశయానికి అనుగుణంగా రాష్ట్ర ఇంధన అవసరాల్ని తీర్చడంలో సాయపడనున్నాయి.

 

ప్రధాని రాంగఢ్ బరాజ్మహల్‌పూర్ బరాజ్ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 9,400 కోట్లకు పైగా ఖర్చుతో చంబల్ నదిపై నవ్‌నేరా ఆనకట్ట నుంచి బీసల్‌పూర్ ఆనకట్ట నిర్మాణ పనులకుఅలాగే ఈసర్‌దా ఆనకట్ట వరకు  ఒక కాలవ ద్వారా నీటిని పంపేందుకు ఉద్దేశించిన ఒక వ్యవస్థ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

 

ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైన సౌర ఇంధన ఫలకాల్ని ఏర్పాటుచేయడంబికనేర్‌లోని పూగల్‌లో 2000 మెగావాట్ల సామర్థ్యంతో ఒక సోలార్ పార్క్‌నుఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే రెండు దశల సోలార్ పార్కుల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారుధోల్‌పూర్‌లోని సాయీపావ్ నుంచి భరత్‌పూర్డీగ్కుమ్హేర్నగర్కామాన్‌పహాడీల వరకు తాగునీటి సరఫరా మార్గాన్ని నిర్మించడంఅలాగే చంబల్ధోల్‌పూర్భరత్‌పూర్ రెట్రోఫిట్టింగ్ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారులూనీ– సమ్‌దడీ– భీల్‌డీ డబల్ లైన్అజ్మీర్ – చందేరియా డబల్ లైన్‌లతోపాటు జైపూర్–  సవాయి మాధోపూర్ డబల్ లైన్ రైల్వే ప్రాజెక్టుల పనులకుఇంధన ప్రసారానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు

 

***