Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిజిట‌ల్ ఇండియా లబ్ధిదారుల‌తో ముఖాముఖి స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


గ‌త కొద్ది రోజులుగా ప్ర‌భుత్వానికి సంబంధించిన వివిధ ప‌థ‌కాల తాలూకు లబ్ధిదారుల‌తో ముఖాముఖి భేటీ అయ్యి వారి అభిప్రాయాల‌ను వినే అవ‌కాశం నాకు చిక్కింది. ఇది నాకు ఒక అద్భుత‌మైన అనుభూతి ని పంచింది. ఫైళ్ళ‌ కు ఆవ‌ల ఒక జీవితం ఉంద‌ని నేను న‌మ్ముతాను. ఈ ప‌థ‌కాల లబ్ధిదారుల జీవితాల‌ను మార్చివేసిన అనుభ‌వాలను గురించి నేను ఆల‌కించిన త‌రువాత నా యొక్క ఆత్మ ఎంత‌గానో సంతృప్తి చెందింది. నా ప‌నిని కొన‌సాగించ‌డానికి మీరు నాకు ఒక కొత్త శ‌క్తి ని అందించారు. ఈ రోజు డిజిట‌ల్ ఇండియా యొక్క లబ్ధిదారులు కొంత మందితో సంభాషించే అవ‌కాశాన్ని నేను అందుకొన్నాను.

నేటి కార్య‌క్ర‌మంలో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల‌ ద్వారా మ‌న దేశం లో దాదాపు 3 ల‌క్ష‌ల మంది పేద‌ల‌తో నేను సంభాషించవచ్చని దృష్టి కి తీసుకువ‌చ్చారు. ఈ సిఎస్‌సి ల‌ను నిర్వ‌హించే విఎల్ఇ ల‌తో పాటు, ఇక్క‌డ ఉన్న‌ వారంద‌రి సేవ‌ల‌ను ఆస్వాదిస్తున్న పౌరులకు తోడు ఎన్ఐసి మాధ్య‌మం ద్వారా డిజిట‌ల్ ఇండియా యొక్క లబ్ధిదారులు కూడా ఇక్క‌డ గుమికూడారు. 1600కు పైగా సంస్థ‌లు మ‌రియు ఆయా సంస్థ‌ల విద్యార్థులు, ప‌రిశోధ‌కులు, శాస్త్రవేత్త‌లు, నేష‌న‌ల్ నాలెడ్జ్ నెట్‌వ‌ర్క్ తో అనుబంధం క‌లిగి ఉన్న‌టువంటి ప్రొఫెస‌ర్లు ఇక్క‌డ ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న బిపిఒ ల లోని ఉద్యోగులు కూడా మ‌న‌తో జ‌త‌ అయ్యారు. అలాగే, మొబైల్ త‌యారీ సంస్థ‌ల శ్రామికులు కూడా మ‌న‌తో మ‌మేక‌ం అవుతారు; వారు త‌మ త‌మ యూనిట్ల‌ను మ‌న‌కు చూపుతారు.

దేశ‌మంత‌టా ఉన్న మైగ‌వ్ (MyGov) కు చెందిన ల‌క్ష‌లాది స్వ‌చ్ఛంద సేవ‌కులు కూడా మ‌న‌తో ఉన్నారు. ఇది 50 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌లు ఒకే అంశం పైన మాట్లాడే విశిష్ట‌మైన ఘ‌ట్టం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ప్ర‌జ‌ల యొక్క అనుభ‌వాల‌ను తెలుసుకోవ‌డం, మ‌రి వారితో సంభాషించ‌డం అంటే అది ఒక అద్భుత‌ సంద‌ర్భం కాగలదు.

‘డిజిట‌ల్ ఇండియా’ ను ప్రారంభించే స‌మ‌యంలో దేశం లోని సామాన్య మాన‌వుడు, పేద‌వారు, రైతులు, యువ‌తీ యువ‌కులు మ‌రియు ప‌ల్లెల‌ను డిజిట‌ల్ లోకంతో సంధానించి వారికి సాధికారిత‌ ను క‌ల్పించాల‌న్న ఒకే ఒక్క ధ్యేయం ఉండింది. గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో మేము ఈ ఏకైక ల‌క్ష్యం పైన శ్ర‌ద్ధ వ‌హించి ప‌ల్లెల‌ను ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ తో జోడించ‌డం మొద‌లుకొని, కోట్లాది ప్ర‌జ‌ల‌ను డిజిట‌ల్ మాధ్య‌మం పట్ల చైత‌న్య‌వంతుల‌ను చేయ‌డం, ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మొబైల్ ఫోన్ ల ద్వారా ప్ర‌జ‌ల ముంగిట‌కు తీసుకుపోవ‌డం, దేశంలో ఎల‌క్ట్రానిక్ త‌యారీ ని అభివృద్ధి చేయ‌డం, స్టార్ట్‌-అప్ ల‌ను లేదా నూత‌న ఆవిష్కారాల‌ను ప్రోత్స‌హించ‌డం నుండి సుదూర ప్రాంతాల‌లో బిపిఒ ల‌ను తెర‌చే విధంగా ప్ర‌చార ఉద్య‌మాన్ని చేప‌ట్ట‌డం వ‌ర‌కు డిజిట‌ల్ సాధికారిత తాలూకు ప్ర‌తి ఒక్క అంశం పైన క‌స‌ర‌త్తు చేయ‌డం జ‌రిగింది.

ఇటువంటివే అనేక కార్య‌క్ర‌మాలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం సీనియ‌ర్ సిటిజ‌న్ లు వారి పెన్ష‌న్ ను పొంద‌డం కోసం లైఫ్ స‌ర్టిఫికెట్స్ ను చూపెట్ట‌డానికి దూర ప్రాంత ప్ర‌యాణాలు చేయ‌న‌క్క‌ర లేదు. వారు వారి యొక్క గ్రామాల‌లో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల‌కు వెళ్ళి వారి ప‌నిని సుల‌భంగా పూర్తి చేసుకోవ‌చ్చు. రైతులు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, పంట‌లు, నేల త‌దిత‌రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని పొంద‌డ‌మే కాకుండా, వారి యొక్క పంట‌ల‌ను డిజిట‌ల్ అంగ‌డి అయిన‌టువంటి ఇఎన్ఎఎమ్ (eNAM) స‌హాయంతో దేశ‌వ్యాప్తంగా విక్ర‌యించ‌నూ వ‌చ్చు. ఇందుకోసం వారు వారి మొబైల్ ఫోన్‌ల‌ను గాని, కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సిఎస్‌సి) ల స‌హాయాన్ని గాని పొంద‌వ‌చ్చు.

ఇవాళ ప‌ల్లె ప్రాంతాల‌లోని విద్యార్థులు వారి పాఠ‌శాల‌ల్లో లేదా క‌ళాశాలల్లో ల‌భ్య‌మ‌వుతున్న పుస్త‌కాల‌కు ప‌రిమితం కాలేదు. వారు ల‌క్ష‌ల కొద్దీ ఆన్‌లైన్ పుస్త‌కాల‌ను డిజిట‌ల్ లైబ్ర‌రీ ద్వారా అందుబాటు లోకి తెచ్చుకోగ‌లుగుతారు. వారు ఇక ఎంత మాత్రం వారి ఉప‌కార వేత‌నాల కోసం పాఠ‌శాల యొక్క ప్ర‌ణాళిక వ్య‌వ‌స్థ‌ల‌పైన ఆధార‌ప‌డ‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఉప‌కార వేత‌నాలు వారి బ్యాంకు ఖాతాల‌ లోకి నేరుగా జ‌మ అవుతున్నాయి. ప్ర‌తిదీ సాంకేతిక విజ్ఞానం మ‌రియు క‌మ్యూనికేశన్ రెవ‌లూశన్ ల ద్వారానే సాధ్య‌ప‌డుతోంది. కొన్ని సంవ‌త్స‌రాల కింద‌టి వ‌ర‌కు చిన్న ప‌ట్ట‌ణాలలో, పల్లెల‌లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు రైల్వే టికెట్ల‌ ను స్టేష‌న్ లలో గంట‌ల త‌ర‌బ‌డి బారు తీర‌కుండానే న‌మోదు చేసుకోవ‌డాన్ని గాని, మలుపు తిరిగిన వ‌రుస‌ లో గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండానే ఎల్‌పిజి ని పొంద‌డం గాని, లేదా ఎల‌క్ట్రిసిటీ బిల్లులను, వాట‌ర్ బిల్లులను, ఇంకా ప‌న్నుల‌ను ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో స్వ‌యంగా హాజ‌రు కాకుండానే చెల్లించవచ్చని గాని ఊహించ‌డం కూడా అసాధ్యంగా ఉండింది. అయితే ప్రస్తుతం ఇటువంటివన్నీ సాధ్యమే; ఇవి ఒకే క్లిక్ దూరం లో ఉన్నాయి కూడాను. ఇవి ఏ కొందరికో కాకుండా ప్ర‌తి ఒక్కరికీ అందుబాటులోకి వ‌చ్చాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సిఎస్‌సి)ల‌ను- ప్ర‌తి ఒక్క పౌరుడు వారి ఇళ్ళ స‌మీపంలోనే గ‌రిష్ఠ సేవ‌ల‌ను పొంద‌గ‌లిగే విధంగా- ప‌టిష్టం చేయ‌డం జ‌రుగుతోంది.

ఈ రోజు వ‌ర‌కు దేశ‌ వ్యాప్తంగా సుమారు 3 ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల‌ను తెర‌వ‌డ‌మైంది. డిజిట‌ల్ స‌ర్వీస్ డెలివ‌రీ సెంట‌ర్ ల భారీ నెట్ వ‌ర్క్ ఒక ల‌క్షా ఎనభై మూడు వేల గ్రామ పంచాయ‌తీలకు విస్త‌రించింది. ఈ రోజున ల‌క్ష‌లాది యువ‌తీ యువ‌కులు విలేజ్ లెవెల్ ఆంత్ర‌ప్రెన్యోర్స్ (విఎల్ఇ లు)గా ప‌ని చేస్తున్నారు. వారిలో యాభైరెండు వేల మంది న‌వ పారిశ్రామికులు మ‌హిళ‌లే అన్న విష‌యం తెలుసుకోవ‌డం ఉత్సాహపరుస్తోంది.

ఈ కేంద్రాలు 10 ల‌క్ష‌ల‌ మందికి పైగా ప్ర‌జ‌ల‌కు ఉద్యోగాల‌ను స‌మ‌కూర్చాయి. మొత్తం మీద ఈ కేంద్రం సాధికారిత‌ కు మూలంగానే కాకుండా విద్య‌ను, న‌వ పారిశ్రామిక‌త్వాన్ని మరియు ఉపాధిని కూడా ప్రోత్స‌హించింది.

ప్ర‌స్తుతం సుమారు 60 ల‌క్ష‌ల మంది స్వ‌చ్ఛంద సేవ‌కులు మైగ‌వ్ (MyGov) ప్లాట్ ఫార‌మ్ తో సంధాన‌మై ఉన్నారు. ఒక రకంగా ఇది పౌరుడు ప్ర‌ధాన కేంద్రంగా న‌డిచే ప్ర‌భుత్వం వ‌లె మారింది. యువ‌తీయువకులు సూచ‌న‌ల‌ను, ఉపాయాల‌ను అందించ‌డంతో పాటు స్వ‌చ్ఛంద సేవ కార్య‌క‌లాపాల‌లో పెద్ద ఎత్తున పాలుపంచుకొంటున్నారు.

వేరు వేరు మంత్రిత్వ శాఖ‌ల‌కు పౌరుల యొక్క వివిధ సూచ‌న‌ల‌ను అందించ‌డానికి, వాటి యొక్క అమ‌లుపై కృషి చేయ‌డానికి మ‌రియు యువ‌త‌ తో సంధానం ఏర్ప‌ర‌చ‌డానికి మైగ‌వ్ (MyGov) ఒక శ‌క్తివంత‌మైన వేదిక‌గా ఆవిర్భ‌వించింది. వీరు అందిస్తున్న అనేక సేవ‌ల యొక్క ఉదాహ‌ర‌ణ‌ల‌ను నేను అవశ్యం మీ ముందు ఉంచాల‌నుకొంటున్నాను. ప్ర‌తి సంవ‌త్స‌ర‌మూ బ‌డ్జెటు లో కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛంద సేవ‌కులు సమీకరించిన‌టువంటి సూచ‌న‌ల‌ను పొందుప‌రుస్తుంది. స్వ‌చ్ఛ్ భార‌త్ మిష‌న్‌, జ‌న్ ధ‌న్ యోజ‌న, ఇంకా డిజిట‌ల్ ఇండియా త‌దిత‌ర ప‌థ‌కాల‌కు అధికార చిహ్నాల‌ను, ఉప శీర్షిక‌ల‌ను మైగ‌వ్ ద్వారా పౌరులు ఇచ్చిన స‌ల‌హాల‌లో నుండే ఎంపిక చేయ‌డ‌మైంది. ఈ ప‌ని కోసం ప్ర‌భుత్వం స‌మ‌యాన్ని వెచ్చించనవసరం లేకపోయింది. ప్ర‌భుత్వం సమూహాల అభిప్రాయాల నుండి ఒక అడుగు ముందుకు వేసి ఈ ప్ర‌జా ప్రాతినిధ్య వేదిక‌ను ఏర్పాటు చేసింది.

దేశం లోని ఏ ప్రాంతం వారైనా త‌మ యొక్క సూచ‌న‌ల‌ను మ‌రియు ప్రేర‌ణాత్మ‌క గాథ‌ల‌ను ప్ర‌తి నెలా ఈ మైగ‌వ్ వేదిక ద్వారా ‘మ‌న్‌ కీ బాత్’ (మనసు లో మాట) కార్య‌క్ర‌మం కోసం పంప‌వ‌చ్చు. ఇవాళ డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మం కోట్లాది ప్ర‌జ‌ల జీవితాల‌లో మార్పు ను తీసుకు వ‌స్తోంది. డిజిట‌ల్ ఇండియా 4ఇ లు.. 1. ఎజుకేశన్ (విద్య‌), 2. ఎంప్లాయ్‌మెంట్ (ఉద్యోగం), 3. ఆంత్ర‌ప్రెన్యోర్‌ శిప్ (న‌వ పారిశ్రామిక‌త్వం) మ‌రియు 4. ఎంప‌వ‌ర్‌మెంట్ (సాధికారిత‌)..ను డిజిట‌ల్ ఇండియా నెర‌వేర్చుతోంది. సామాన్య మాన‌వుని జీవితాన్ని డిజిట‌ల్ ఇండియా మెరుగు ప‌రుస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను. ఈ అంచ‌నా తో మీ అంద‌రికీ నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయాల‌నుకొంటున్నాను. అయితే, నేను మీ అంద‌రినీ ఒక విష‌య‌మై అభ్య‌ర్థిస్తున్నాను. కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల సిబ్బంది వ‌ద్ద నుండి నాకు ఉన్న‌త‌మైన అంచ‌నాలు ఉన్నాయి. వారు నా మాట‌ల‌ను ఆల‌కిస్తున్నారు. వారిని నేను తెర‌ పైన చూడ‌గ‌లుగుతున్నాను. కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల ఉద్యోగులు వారి చేతుల‌ను పైకెత్తి ఉంచుతారా ? మీరు నాకు ఒక ప‌నిని చేసిపెడ‌తారా ? ద‌య‌చేసి మీ చేతుల‌ను పైకి ఎత్తి, ఈ ప‌నిని చేసిపెడతామని నాతో చెబుతారా ? ఇదే పనిని చేయండంటూ బిపిఒ ఉద్యోగుల‌ను నేను అడ‌గ‌డం లేద‌ని దీని యొక్క అర్థమేమీ కాదు.

మీకు ఒక విష‌యాన్ని నన్ను చెప్ప‌నివ్వండి. . మీరంతా జూన్ 20వ తేదీ నాడు ఇదే స‌మ‌యానికి, అంటే ఉద‌యం పూట 9.30 గంట‌ల‌కు, నేను రైతుల‌తో మాట్లాడుతాన‌న్న సంగ‌తిని గుర్తుపెట్టుకోవాల‌ని మిమ్మల్ని నేను కోరుతున్నాను. నేను నా యొక్క రైతు సోద‌రులతోను, నా యొక్క రైతు సోద‌రీమ‌ణుల‌తోను మాట్లాడుతాను. మీరు నాకు ఒక స‌హాయం చేస్తారా ? కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల‌లో 10-20 మంది వ‌చ్చిన మాదిరిగానే మీరు 20వ తేదీన 50-100 రైతుల‌ను మీ యొక్క కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ ల‌కు తీసుకు వ‌స్తారా ? వారితో నేను మాట్లాడ‌ద‌ల‌చాను. ఈ ప‌నిని చేసిపెట్ట‌డానికి సిద్ధంగా ఉన్న వారు ఎవ‌రైనా ద‌య‌చేసి మీ చేతుల‌ను పైకి ఎత్తండి. రైతుల‌తో మేము మాట్లాడుతాము. మ‌రి చ‌ర్చ వారికి సంబంధించిన అంశాల పైన ఉంటుంది.

ఇది మీ సిఎస్‌సి ని ఎంతో బ‌లంగా తయారు చేస్తుంది. దేశ ప్ర‌ధాన మంత్రి త‌న ఆలోచ‌న‌ల‌ను ఈ 3 ల‌క్ష‌ల సిఎస్‌సి ల ద్వారా నేరుగా పంచుకోగ‌లుగుతారు. ఉదాహ‌ర‌ణ‌గా చెప్పాలంటే, నేను టీకాల కార్య‌క్ర‌మం జరిగే క‌న్నా ముందు ప్ర‌జ‌ల‌తో మాట్లాడాల‌ని అనుకొంటున్నాన‌ని చెబుతాను. ఇది టీకాల ప్ర‌చార ఉద్య‌మానికి ఎంతో ఉత్తేజాన్ని అందిస్తుంది. టెలివిజ‌న్ ల ద్వారా ప్ర‌జ‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌డం క‌న్నా ఈ ప‌ద్ధ‌తి ఎన్నో రెట్లు బ‌ల‌మైంది. మీరంతా 20వ తేదీ నాడు ఉద‌యం 9.30 గంట‌ల‌కు మీ యొక్క సిఎస్‌సి ల‌కు 50-100 రైతు సోద‌రులు మ‌రియు రైతు సోద‌రీమ‌ణుల‌ను తీసుకు వ‌స్తార‌నుకొంటున్నాను. వ్య‌వ‌సాయ రంగంలో ప‌రివ‌ర్త‌న‌కు సంబంధించి వారితో నేను మాట్లాడుతాను. అలాగే ఆయా ప‌థ‌కాల తాలూకు ప్ర‌యోజ‌నాల‌ను ఒక గ్రామ‌స్తుడు సైతం ఏ విధంగా పొంద‌వ‌చ్చో సూచిస్తాను. వారి అనుభ‌వాల‌ను కూడా నేను వినాలనుకొంటున్నాను.

మిత్రులారా,

ఇది నాకు ఒక సంతోష‌క‌ర‌మైన అనుభ‌వం. దేశంలో పెను మార్పు చోటు చేసుకొంటోంది అంటే అందుకు మీరు మ‌రియు మీ చేతి వేళ్ళ చివ‌ర‌లే కార‌ణం.

సంస్క‌ర‌ణ‌, ప్ర‌ద‌ర్శ‌న మ‌రియు ప‌రివ‌ర్త‌న (Reform, Perform and Transform) ల ద్వారా పురోగ‌తి కై, అభివృద్ధి కై ప్ర‌భుత్వం కంకణం కట్టుకొంది. మ‌రొక్క‌మారు మీకు అంద‌రికీ ఇవే నా శుభాకాంక్ష‌లు. మరి అలాగే అనేకానేక ధ‌న్య‌వాదాలు కూడాను. న‌మ‌స్తే.

***