మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. ఆ రాష్ట్రాని కి ఉప ముఖ్యమంత్రులు గా శ్రీ జగ్ దీశ్ దేవ్‌డా మరియు శ్రీ రాజేంద్ర శుక్ల లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో వారి కి కూడా అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘దేశాని కి హృదయ స్థానం లో ఉన్నటువంటి మధ్య ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో డాక్టర్ శ్రీ మోహన్ యాదవ్ గారి కి మరియు ఉప ముఖ్యమంత్రులు జగదీశ్ దేవ్‌డా గారి కి, రాజేంద్ర శుక్ల గారి కి ఇవే హృదయపూర్వకమైన అభినందన లు. మీ యొక్క నాయకత్వం లో రాష్ట్రం లో డబల్ ఇంజన్ ప్రభుత్వం రెండు రెట్ల ఉత్సాహం తో పని చేస్తుందని మరియు అభివృద్ధి తాలూకు సరిక్రొత్త ప్రమాణాల ను నెలకొల్పుతుందన్న విశ్వాసం నాలో ఉంది. ఈ సందర్భం లో అక్కడి నా యొక్క కుటుంబ సభ్యులు అందరికి మీ యొక్క జీవనాన్ని సరళతరం గా మార్చడం లో బిజెపి ప్రభుత్వం సర్వ శక్తుల ను వినియోగిస్తుంది అనేటటువంటి బరోసా ను నేను ఇస్తాను.’’ అని పేర్కొన్నారు.
देश के हृदयस्थल मध्य प्रदेश के मुख्यमंत्री पद की शपथ लेने पर डॉ. मोहन यादव जी और उप मुख्यमंत्री जगदीश देवड़ा जी एवं राजेंद्र शुक्ला जी को हार्दिक बधाई! मुझे विश्वास है कि आपके नेतृत्व में राज्य में डबल इंजन सरकार दोगुने जोश के साथ काम करेगी और विकास के नए प्रतिमान गढ़ेगी। इस… pic.twitter.com/wCkscH0l2M
— Narendra Modi (@narendramodi) December 13, 2023