Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన జయంతి సందర్భం గా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఈ రోజు ఆయన జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. మాతృభూమి పట్ల డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఉన్న భక్తి, ఆయన చేసిన త్యాగం దేశప్రజలకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో:

‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆయనలో ఉన్న జాతీయవాద ఆలోచనల తో భరత మాత కు గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ఆయనకు ఆయన జయంతి సందర్భంగా ఇదే ఆదరపూర్వకమైన శ్రద్ధాంజలి. మాతృభూమి కోసం ఆయన చాటిన సమర్పణభావం మరియు త్యాగం దేశవాసులకు సదా ప్రేరణను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.  

******

DS/SR