Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డాక్టర్ పృథ్వీంద్ర ముఖర్జీ మృతికి ప్రధాని సంతాపం


డాక్టర్ పృథ్వీంద్ర ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారు. డాక్టర్ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అని, సంగీతం, కవిత్వంపై మక్కువ కలిగిన వారని శ్రీ మోదీ అన్నారు.

 ‘‘డాక్టర్ పృథ్వీంద్ర ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. మేధో ప్రపంచంలో బలమైన ముద్ర వేశారు. సంగీతం, కవిత్వంపై ఆయనకు మక్కువ ఎక్కువ. ఆయన రచనలు, స్వరాలు ఎన్నేళ్లైనా ప్రశంసలు అందుకుంటూనే ఉంటాయి. భారత చరిత్రను ముఖ్యంగా స్వాతంత్య్ర ఉద్యమకాలం నాటి చరిత్రను సంరక్షించేందుకు, భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన చేసిన కృషి అమూల్యం. ఆయన మరణం నాకు బాధను కలిగించింది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

 

 

***

MJPS/SR