Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  భేటీ


గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో భారత యూపీఐ వేదికను వినియోగించుకుంటున్నందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి, డిజిటల్ పరివర్తనలో ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం మొదట్లో ఐసీసీ టీ-20 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ పోటీలకు సహ ఆతిథ్యం అందించినందుకు  ప్రధానమంత్రి రౌలీకి అభినందనలు తెలిపారు.  

ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వైపాక్షిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన ఇరువురు నేతలూ…  భద్రత, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యవసాయం, రవాణా, వ్యవసాయం, సామర్థ్య పెంపు సహా సాంస్కృతిక పరమైన సహకారాలను పటిష్ఠ పరచాలని, ఇరుదేశాల ప్రజల మధ్య మరింత స్నేహ సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. చర్చల అనంతరం ఆహార శుద్ధికి సంబంధించి ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.