Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టేక‌న్‌పుర్ కు చేరుకొన్న ప్ర‌ధాన మంత్రి; డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ ఆఫ్ పోలీస్ మ‌రియు ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ ఆఫ్ పోలీస్ ల స‌మావేశానికి హాజ‌రు


డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ ఆఫ్ పోలీస్ మ‌రియు ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్ ఆఫ్ పోలీస్ స‌మావేశంలో పాల్గొన‌డానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య ప్ర‌దేశ్ లోని టేక‌న్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడ‌మీ కి ఈ రోజు విచ్చేశారు.

రోజంతా భ‌ద్ర‌త‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై నివేదికల‌ స‌మ‌ర్ప‌ణ‌ల‌తో పాటు ఉప‌యోగ‌క‌ర చ‌ర్చ‌లు జ‌రిగాయి. గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో తీసుకొన్న నిర్ణ‌యాల అమ‌లు తీరు ఏ స్థాయిలో ఉందో తెలిపే ఒక నివేదిక స‌మ‌ర్ప‌ణ కూడా చోటు చేసుకొంది.

భ‌ద్ర‌త మ‌రియు పోలీసు ప‌ర్య‌వేక్ష‌ణ సంబంధిత నిర్ధిష్ట అంశాల‌పై ఎంపిక చేసిన కొంత మంది అధికారుల‌తో భోజ‌న స‌మ‌యంలో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం పై ప్ర‌ధాన మంత్రి శ్ర‌ద్ధ తీసుకొన్నారు. మొత్తం మీద తొమ్మిది గంట‌ల‌కు పైగా ప్ర‌ధాన మంత్రి ముఖాముఖి స‌మావేశం సాగింది.

అంత క్రితం- ప్ర‌ధాన మంత్రి బిఎస్ఎఫ్ అకాడ‌మీ కి చేరుకోవ‌డంతోనే- అకాడ‌మీలో కొత్తగా నిర్మించిన అయిదు భ‌వ‌నాల ప్రారంభ సూచ‌కంగా ఫ‌ల‌కాల‌ను ఆవిష్క‌రించారు.

చ‌ర్చ‌లు రేపు సైతం కొన‌సాగుతాయి. ప్ర‌ధాన మంత్రి ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యే ముందు- రేపు మ‌ధ్యాహ్నం జరిగే స‌మావేశపు ముగింపు కార్య‌క్ర‌మంలో- ప్ర‌సంగిస్తారు.