Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టెలిక‌మ్ రంగం లోని ఆందోళ‌న‌క‌ర ఆస్తుల‌పై అంత‌ర్ మంత్రిత్వ బృందం సిఫారసుల‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


టెలికమ్‌ రంగంలో రెండు కీలక చర్యలకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ రంగంలో పెట్టుబ‌డుల‌కు మార్గం సుగమం చేయడానికి, ఈ రంగంలో ఏకీకరణకు మరియు ఈ రంగంలో వ్యాపారాన్ని సుల‌భ‌త‌రంగా చేసే ప్రక్రియను అధికం చేసేందుకు ఉద్దేశించినవే ఈ రెండు కీలకమైన చర్యలు.   వీటిలో.. టెలిక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ కు సంబంధించిన స్పెక్ట్ర‌మ్ వేలం తాలూకు వాయిదా వేసిన చెల్లింపుల‌ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రణ ఒకటో చర్య కాగా టెలిక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ క‌లిగివుండే స్పెక్ట్ర‌మ్ క్యాప్ ప‌రిమితి యొక్క సవరణ రెండో చర్య.

 

వివ‌రాలు:

 

స్పెక్ట్ర‌మ్ కు సంబంధించి టెలిక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వాయిదా వేసిన చెల్లింపులను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించ‌డం జరుగుతుంది. 

ప్ర‌స్తుతం ప‌ది వాయిదాలలో చెల్లించ‌డానికి అనుమ‌తి ఉంది.  కానీ దీనిని మ‌రింత ఎక్కువ చేయ‌డం జ‌రిగింది.  ఈ అవ‌కాశం కార‌ణంగా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ అత్య‌ధికంగా 16 వాయిదాలలో త‌మ చెల్లింపులను చేయ‌వ‌చ్చు.  ఈ పెంచిన వాయిదా మొత్తం ఆ చెల్లించాల్సిన చెల్లింపు ప్ర‌స్తుత మొత్తం విలువ ప్ర‌కారం ఉండాల‌నే నిబంధ‌న మీద ఆధార‌ప‌డివుంటుంది.  2012 లో స్పెక్ట్ర‌మ్ వేలానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటూ ఇచ్చిన నోటీసు ప్ర‌కారం దీనికి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం జ‌రిగింది.  ప్ర‌భుత్వానికి అందే చెల్లింపుల మొత్తం 2034-35 నాటికి రూ. 74446.01 కోట్ల కంటే ఎక్కువ‌గా ఉండాలి.

 

స్పెక్ట్ర‌మ్ ను క‌లిగివుండ‌డానికి స్పెక్ట్ర‌మ్ క్యాప్‌ కు సంబంధించి స‌వ‌రించిన ప‌రిమితులు

 

ట్రాయ్‌, టెలిక‌మ్ క‌మిష‌న్ లు ఇచ్చిన సిఫారసుల ఆధారంగా మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది.  స్పెక్ట్ర‌మ్ ను క‌లిగివుండాలంటే దీనికి సంబంధించిన క్యాప్‌ ప‌రిమితుల స‌వ‌ర‌ణ ఈ విధంగా ఉంటుంది:-

 

ప్ర‌స్తుతం స్పెక్ట్ర‌మ్ క్యాప్ ప‌రిమితి 25 శాతం వ‌ర‌కు ఉంది.  దీనిని మొత్తం మీద 25 శాతాన్నుండి 35 శాతానికి స‌వ‌రిస్తారు.

ప్ర‌స్తుతం ఉన్న ఇంట్రా- బ్యాండ్ క్యాప్ ను తొల‌గిస్తారు.  దీనికి బ‌దులుగా స‌బ్- 1 జిహెచ్ జెడ్ బ్యాండ్ లలో (700 ఎంహెచ్ జడ్‌, 800 ఎంహెచ్ జడ్‌, 900 ఎంహెచ్ జడ్ బ్యాండ్ లు) అన్నిటినీ క‌లుపుకొని  స్పెక్ట్ర‌మ్ ను క‌లిగి వుండే క్యాప్ ను 50 శాతం చేయ‌డం జ‌రిగింది.

వ్య‌క్తిగ‌తంగాను, అన్నీ క‌లుపుకొని క‌లిగివుండే 1 జిహెచ్ జడ్ బ్యాండ్ స్పెక్ట్ర‌మ్ కు ఎలాంటి క్యాప్ వుండ‌దు.

2019 లో జ‌రిగే ప్ర‌పంచ రేడియో క‌మ్యూనికేష‌న్ స‌ద‌స్సు వెలువ‌రించే అంతిమ చ‌ట్టాల త‌రువాత ఇప్పుడు స‌వ‌రించిన స్పెక్ట్ర‌మ్ క్యాపుల‌ను తిరిగి స‌వ‌రించ‌డం జ‌రుగుతుంది.  సాంకేతిక‌ప‌ర‌మైన ప్ర‌గ‌తి, ప్ర‌తిభావంతంగా స్పెక్ట్ర‌మ్ ను వినియోగించుకోవ‌డం, ఏకీక‌ర‌ణ చ‌ర్య‌లు మొద‌లైన‌ వాటిని దృష్టిలో పెట్టుకొని స్పెక్ట్ర‌మ్ క్యాప్ ప‌రిమితుల‌ను స‌వ‌రించాల‌ని ట్రాయ్ సిఫారసు చేసింది.

 

ప్ర‌భావం:

 

వాయిదా వేసిన చెల్లింపుల‌ను పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించ‌డంవ‌ల్ల టెలిక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ కు వెంట‌నే వారికి ఉన్న‌ కాల‌ వ్య‌వ‌ధిలో న‌గ‌దు అందుబాటు పెరుగుతుంది.  దాంతో వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.  స్పెక్ట్ర‌మ్ క్యాప్ ప‌రిమితిని స‌వ‌రించ‌డం వ‌ల్ల‌ టెలిక‌మ్ లైసెన్సుల ఏకీక‌ర‌ణ కు మార్గం సుగ‌మం అవుతుంది.  త‌ద్వారా ముందుముందు జ‌రిగే వేలంపాటలలో మ‌రింత మంది ఎక్కువ‌గా పాల్గొనేటట్టు ప్రోత్సాహాన్ని అందించినట్లు అవుతుంది.