ఎ) డిపిఇ నిబంధనలకు అనుగుణంగా టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్)లో బోర్డు స్థాయి దిగువపోస్టులలో మొత్తం పోస్టులలో పదిశాతానికి మించకుండా టెలికమ్యూనికేషన్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేపథ్యంకలిగిన డిపార్టమెంట్ ఆప్ టెలికమ్యూనికేషన్స్(డిఒటి),ఇతర మంత్రిత్వశాఖలకు చెందిన గ్రూప్ ఎ అధికారుల డెప్యుటేషన్లను 1.10.2016 నుంచి ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం వేసే తేదీ వరకు అనుమతిస్తూ నిర్ణయించారు. (ఇంతకు ముందు కేబినెట్ అనుమతి 30.9.2016 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంది) అలాగే కేబినెట్ ఆమోదం పొందిన నాటి నుంచి మరో మూడు సంవత్సరాలపాటు దీనిని పోడిగించారు.ఇందుకు సంబంధించి సత్వరం వారిని సంస్థలోకి తీసుకోవాలన్న నిబంధన విషయంలో మినహాయింపునిచ్చారు. అలాగే
బి) టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టిసిఐఎల్)లో బోర్డు స్థాయికంటె తక్కువ పోస్టుల విషయంలో మినహాయింపును భవిష్యత్తులో కొనసాగించడానికి సంబంధించి డిపిఇ ఒఎం నెంబర్ 16(6)/2001-జిఎం-జిఎల్-77 తేదీ 28.12.2005కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి ప్రతిపాదనను తిరిగి కేబినెట్ ముందుకు తీసుకు రావలసిన అవసరం లేదు.
నేపథ్యం.
టిసిఐఎల్ ఒక ప్రముఖ ఐఎస్ఒ -9001: 2008., ఐఎస్ఒ :2008,14001:2004 సర్టిఫికేషన్ కలిగిన మిని రత్న కేటగిరి-1 స్థౄయి పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్(పిఎస్‌యు).టిసిఐఎల్ -టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెన్సి, ఇంజనీరింగ్ రంగంలోని కంపెనీ. టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దీనికి బలమైన పునాది ఉంది. భారత ప్రభుత్వం కింది లక్ష్యాలతో ఈ సంస్థను 1978లో ఏర్పాటు చేసింది.
1)టెలికమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞనాన్ని అందించడం, టెలికమ్యూనికేషన్స్‌లోని అన్ని రంగాలలో భారతీయ నైపుణ్యాన్ని అందించడం
2)తగిన మార్కటెంగ్ వ్యూహాలను అభివృద్ధి చేస్తూ దేశ, విదేశీ మార్కెట్‌లలో నిలదొక్కుకోవడం, విస్తరణ కార్యకలాపాలు చేపట్టడం, కార్యకలాపాలలో ప్రతిభ కనబరచడం,
3)నిరంతరాయంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడం
టిసిఐఎల్ సంస్థ నూరుశాతం భారతప్రభుత్వ అండర్ టేకింగ్.ఇది టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో 70కి పైగా దేశాలలో ప్రాజెక్టులను అమలు చేసింది. టెలికమ్యూనికేషన్స్, ఐటి , సివిల్ నిర్మాణాల రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రాథమిక దశనుంచి దాని పూర్తి అయ్యే వరకు కన్సల్టెన్సీ, టర్న్‌కీ సేవలను ఈ సంస్థ అందిస్తుంది. 2017 మార్చి 31 నాటికి ఈ సంస్థ అధీకృత మూలధనం 60 కోట్ల రూపాయలు.ఇందులో పెయిడ్ అప్ కేపిటల్ 59.20 కోట్లు.
టిసిఐఎల్ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ48 దేశాలలో పాన్ ఆఫ్రికన్ ఇ నెట్ వర్క్‌ను అమలు చేస్తోంది. ఇది టెలి విద్య, టెలి వైద్యం, ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలకు ఆఫ్టికల్ ఫైబర్, ఉపగ్రహ అనుసంధానం ద్వారా డబ్ల్యుఐపి అనుసంధానతను కల్పించడాన్ని 2009 సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. ఇది కాల నియతితో ముడిపడిన ప్రాజెక్టు దీని కార్యకలాపాలు, నిర్వహణను 2021 జూలై వరకు చేపట్ట వలసి ఉంది. విదేశీ ప్రాజెక్టులకు తోడుగా టిసిఐఎల్ మన దేశంలో కూడా ఐటి, టెలికమ్యూనికేషన్స్‌రంగాలకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులను వివిధ ప్రాంతాలలో అమలు చేస్తొంది. వీటిలో ముఖ్యమైనవి రక్షణరంగానికి ఎన్.ఎల్.డి నెట్‌వర్క్, భారతీయ నౌకా దళానికి ఎన్ఎప్ఎస్ నెట్ వర్క్, జమ్ము కాశ్మీర్‌లో ఒపిజిడబ్ల్యు, డిఒపి రూరల్ ఐసిటి సొల్యూషన్ ప్రాజెక్టు ఒడిషాలో 500 పాఠశాలలు, ఉత్తరప్రదేశ్‌లో 2500 పాఠశాలల్లో ఐసిటి ప్రాజెక్టులు, వివిధ రాష్ట్రాలలో వెబ్ ఆధారిత సేవలు వంటి వాటికి సంబంధించి ప్రొక్యూర్‌మెంట్, సప్లయ్, ట్రెంచింగ్, స్థాపన, టెస్టింగ్, మెయింటినెన్స్ వంటివి ఉన్నాయి. అలాగే బిబిఎన్ఎల్ కు నోఫిన్ ప్రాజెక్టుకు ప్రాజెక్టు నిర్వహణకు హార్డ్‌వేర్ సాఫ్ట్‌వేరే సరఫరా వంటి వి ఉన్నాయి.
ప్రస్తుత విదేశీ, దేశీయ ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి టిసిఐఎల్‌కు టెలికం, ఐటి రంగాల నేపథ్యం కలిగిన నిపుణులైన ప్రతిభగల సీనియర్ అధికారుల అవసరం ఉంది. ఆయా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వీరి అవసరం ఉంటుంది. దీనితో నిపుణులైన మానవ వనరులను టిసిఐఎల్ డెప్యుటేషన్ ద్వారా సమకూర్చుకోవడం ద్వారా టిసిఐఎల్ జాతీయ , అంతర్జాతీయ మార్కెట్‌లలో తగిన పోటీని ఇవ్వగలుగుతుంది. తక్కువ వ్యవధిలో తనకు అవసరమైన నైపుణ్యాలు గల ప్రతిభావంతులను ఓపెన్ మార్కెట్‌నుంచి డెప్యుటేషన్ రేట్లతో పోల్చి చూపినపుడు తక్కువధరకు సమకూర్చుకోవడం కష్టం.అలాగే ఓపెన్ మార్కెట్‌నుంచి సమకూర్చుకుంటే వారు సంస్థకు శాశ్వత లయబిలిటీగా మారతారు. డెప్యుటేషన్ విధానంలో ఇది ఉండదు. వీరు ప్రాజెక్టు కాలంలో మాత్రమే టిసిఐఎల్‌తో ఉంటారు. ప్రాజెక్టు కాలానికే వారి సేవలు అవసరమౌతాయి.
ఇందుకు అనుగుణంగా, కేంద్ర కేబినెట్ టిసిఐఎల్‌ను, డిపార్టమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఇతర మంత్రిత్వశాఖల నుంచి టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేపథ్యం కలిగిన గ్రూప్ ఎ అధికారులను డెప్యుటేషన్‌పై తీసుకోవడానికి అనుమతిచ్చింది. 1.10.2016 నుంచి ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందిన నాటికి మధ్య దీనిని వర్తింప చేస్తారు.( గతంలో కేబినెట్ ఆమోదం 30.9.2016 వరకు వర్తించేది), అలాగే ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందిన తర్వాతనుంచి మరో మూడు సంవత్సరాలపాటు ఇవి వర్తిస్తాయి. డిపిఇ మార్గదర్శకాలకు అనుగుణంగా టిసిఐఎల్‌లోని బోర్డు దిగువస్థాయి పోస్టులలో మొత్తం పోస్టులలలో పదిశాతానికి మించకుండా ఈ నియామకాలు జరిపేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. భవిష్యత్తులో టిసిఐఎల్‌లో బోర్డు స్థాయి కంటే తక్కువస్థాయి గల పోస్టుల విషయంలో మినహాయింపు ఇచ్చే అంశాన్ని డిపిఇ ఒఎం నెంబర్ 18(6)72001-జిఎం-జిఎల్-77 తేదీ 28-12-2005 మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు.