Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

టెక్సాస్ లోని హ్యూస్ట‌న్ లో దావూదీ బోహ్రా స‌ముదాయాని కి చెందిన స‌భ్యుల తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టెక్సాస్ లోని హ్యూస్ట‌న్ లో దావూదీ బోహ్రా స‌ముదాయాని కి చెందిన స‌భ్యుల తో నేడు భేటీ అయ్యి, వారి తో సంభాషించారు.

ఆ స‌ముదాయాని కి చెందిన స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి ని స‌త్క‌రించారు. సంభాష‌ణ క్ర‌మం లో, దావూదీ బోహ్రా స‌భ్యులు స‌య్య‌ద్‌నా సాహబ్ తో ప్ర‌ధాన మంత్రి కి ఉన్న‌టువంటి సాహచర్యాన్ని గురించి ప్ర‌స్తావించారు. వారు కింద‌టి సంవ‌త్స‌రం లో ఇందౌర్ లో జ‌రిగిన వారి యొక్క సాముదాయక కార్యక్ర‌మాని కి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కావ‌డాన్ని కూడా గుర్తు కు తెచ్చారు.

ఈ సంభాషణ అనంత‌రం ప్ర‌ధాన మంత్రి ట్విటర్ లో తన ప్రతిస్పందన ను వ్యక్తం చేస్తూ, “దావూదీ బోహ్రా స‌ముదాయం ప్ర‌పంచ వ్యాప్తంగా త‌నదైనటువంటి ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకొంది. వారి తో హ్యూస్ట‌న్ లో కొంత స‌మ‌యాన్ని వెచ్చించే అవ‌కాశం తో పాటు అనేక అంశాల పై సంభాషించే అవకాశం కూడా నాకు లభించింది” అని పేర్కొన్నారు.

**