Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘టిజడ్ఎంఒ’ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో ప్రధానమంత్రి సమావేశం

‘టిజడ్ఎంఒ’ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్  శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో ప్రధానమంత్రి సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ పోలాండ్‌లో విభిన్న పరిశుభ్రత ఉత్పత్తుల తయారీ సంస్థ ‘టిజడ్ఎంఒ’, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అలీనా పోస్లుజ్నీతో సమావేశమయ్యారు.

   భార‌త్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధివిధానాల సరళీకరణ, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. అలాగే భార‌త్‌లోగల విస్తృత మార్కెట్, పెట్టుబడి అవకాశాల నేపథ్యంలో ‘టిజడ్ఎంఒ’ విస్తరణ ప్రణాళికలపై వారిద్దరూ చర్చించారు.

   భారతదేశంలో తమకు అవకాశాలు కల్పించడంతోపాటు తగిన మద్దతు లభించడంపై ప్రధానమంత్రికి శ్రీమతి అలీనా పోస్లుజ్నీ కృతజ్ఞతలు తెలియజేశారు.