Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝాన్సీ వైద్య కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులు మరణించడంతో ప్రధానమంత్రి సంతాపం


ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైద్య కళాశాలలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు చేతనైన ప్రతి ఒక్క సహాయాన్ని అందించడంలో నిమగ్నం అయిందని ఆయన హామీనిచ్చారు.

ఎక్స్ లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘హృదయవిదారకం! ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో మెడికల్ కాలేజీలో మంటలు చెలరేగడంతో జరిగిన దుర్ఘటన బాధాకరం. ఏ పాపం ఎరుగని తమ చిన్నారులను ఈ అగ్నిప్రమాదం కారణంగా కోల్పోయిన వ్యక్తులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ అంతులేని దు:ఖాన్ని వారు ఓర్చుకొనే శక్తిని వారికి ఇవ్వాల్సిందిగా ఆ పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలనా యంత్రాంగం సహాయక, ఉపశమన చర్యలను చేపట్టడంలో చేతనైన అన్ని  ప్రయత్నాలను చేయడంలో నిమగ్నమైంది: పీఎమ్@narendramodi”

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైద్య కళాశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మీయులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్-గ్రేషియాను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇస్తారని ఆయన తెలిపారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్ఓ) ఈ కింది విధంగా పేర్కొంది:

‘‘ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మీయులకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్-గ్రేషియాను ప్రధాన మంత్రి @narendramodi ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఇస్తారు.’’