దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్‌లీహుడ్స్ మిశన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగంగా జమ్ము & కశ్మీర్ కు ప్రకటించిన స్పెశల్ ప్యాకేజీ అమలు ను 2018-19 లో ఒక సంవత్సర కాలం పాటు పొడిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
అలాగే, స్పెశల్ ప్యాకేజీ ని.. పేదరికం నిష్పత్తి తో ముడిపెట్టకుండా అవసరం ఆధారంగా.. అమలు పరచేందుకుగాను డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్ లో భాగంగా రాష్ట్రానికి నిధులను కేటాయించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల అదనపు ఆర్థిక భారం ఏమీ పడదు. ఎందుకంటే, 755.32 కోట్ల రూపాయల మేరకు తొలుత ఆమోదించిన వ్యయ పరిధి లోపలే రాష్ట్రం లోని దుర్బల కుటుంబాల లో మూడింట రెండు వంతుల కుటుంబాలకు రక్షణ ను అందించేందుకు ఉద్దేశించిన కాలావధి ని పెంచడానికి సంబంధించి ఆమోదాన్ని తెలపడమైంది కాబట్టి. 2018-19 లో ఒక సంవత్సర కాలానికిగాను 143.604 కోట్ల రూపాయలు అవసరమవుతాయి.
ప్రభావం:
దీని తో
– రాష్ట్రం లోని బలహీనమైన గ్రామీణ కుటుంబాలన్నీ (ఇటువంటివి మొత్తం కుటుంబాల్లో మూడింట రెండు వంతుల మేరకు ఉండవచ్చని అంచనా) నిర్దిష్ట కాలావధి లోపు రక్షణ కు నోచుకోగలవు.
– ఆటో ఇన్‌క్లూజన్ కేటగిరీ లోకి వచ్చే కుటుంబాలను మరియు సామాజిక- ఆర్థిక వర్గ జన గణన- 2011 లో సూచీబద్ధమైన కనీసం ఒక వంచిత శ్రేణి లో కుటుంబాల కలయిక ఖాయం కాగలదు.
– డిఎవై ఎన్ఆర్ఎల్ఎమ్ లో భాగం గా జమ్ము & కశ్మీర్ లో అన్ని బ్లాకులకూ కవరేజి ఖాయం కావడం తో పాటు రాష్ట్రం లో సామాజిక కలయిక, సామాజిక వికాసం మరియు పేదరికాన్ని తగ్గించడం లో ఉపాధి కి ప్రోత్సాహకం అందనున్నాయి.
పూర్వ రంగం:
రాష్ట్రం లో అనివార్య కారణాల వల్ల మరియు గందరగోళ పరిస్థితుల వల్ల 2013వ సంవత్సరం మే నెల లో ఆమోదించినటువంటి స్పెశల్ ప్యాకేజీ ని పూర్తి గా అమలు పరచడం జరుగలేదు. ప్రస్తుతం ఇదివరకు ఆమోదించిన స్పెశల్ ప్యాకేజీ లోని అంశాలను అమలుపరచే కాలావధి ని పొడిగించడం గురించి పరిశీలించాలని భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. అలాగే జమ్ము & కశ్మీర్ లో ఈ విస్తరించిన కాలావధి లో డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్ లో భాగంగా నిధుల అందజేత ను పేదరికం నిష్పత్తి తో ముడిపెట్టకుండా డిమాండు ఆధారంగా కొనసాగించడాన్ని గురించి కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం మనవి చేసింది. ఈ విధంగా మంత్రివర్గం యొక్క ఆమోదం జమ్ము & కశ్మీర్ లో బలహీనమైన గ్రామీణ కుటుంబాలకు ఒక ప్రోత్సాహకాన్ని ఇవ్వగలుగుతుంది.
**