కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. వీటిలో 5 ఐఆర్ బెటాలియన్ లు జమ్ము& కాశ్మీర్ లోను, 4 ఐఆర్ బెటాలియన్లు ఛత్తీస్గఢ్ లోను, 3 ఐఆర్ బెటాలియన్లు జార్ఖండ్, 3 ఐఆర్ బెటాలియన్లు ఒడిశా లోను, 2 ఐఆర్ బెటాలియన్లు మహారాష్ట్ర లోను ఏర్పాటవుతాయి. ఈ 17 బెటాలియన్ల ఏర్పాటులోని ముఖ్య ఉద్దేశాలు ఇలా ఉన్నాయి..:
• వీటిలోకి స్థానిక యువకులను భర్తీ చేసుకుంటారు. ఇందుకోసం అవసరమయితే వయస్సు, విద్యార్హత ప్రాతిపదికలను రాష్ట్రాలు సడలిస్తాయి. • జమ్ము&కాశ్మీర్ లో ఏర్పాటయ్యే 5 బెటాలియన్ల విషయంలో కానిస్టేబుల్స్, నాలుగో తరగతి ఉద్యోగాలలో 60 శాతం ఉద్యోగ ఖాళీలను ఆ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల నుంచి భర్తీ చేస్తారు.
• ఎల్ డబ్ల్యు ఈ రాష్ట్రాల విషయానికి వస్తే, కానిస్టేబుల్స్ ఉద్యోగ ఖాళీలలో 75 శాతం భద్రతా సంబంధిత వ్యయం (ఎస్ ఆర్ ఈ) పథకం కింద 27 కీలక జిల్లాల నుంచి భర్తీ చేస్తారు.
ఇండియన్ రిజర్వు బెటాలియన్ ల పథకాన్ని భారత ప్రభుత్వం 1971లో ప్రవేశపెట్టింది. ఇంతవరకు వేరువేరు రాష్ట్రాలకు 123 ఐ ఆర్ బెటాలియన్లను భారత ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 144 ఐఆర్ బెటాలియన్లు ఏర్పాటయ్యాయి. జార్ఖండ్ లో ఒక బెటాలియన్ ను స్పెషలైజ్డ్ ఇండియన్ బెటాలియన్ (ఎస్ ఐ ఆర్ బి)గా మార్పు చేశారు. దీనిలో రెండు ఇంజినీరింగ్ కంపెనీలు, 5 సెక్యూరీటీ కంపెనీలు ఉన్నాయి.