Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ కు ఉద్దేశించిన బిల్లు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన చ‌ర్య‌; పేద‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌ కు అద్దం ప‌ట్టేదన్న ప్ర‌ధాన మంత్రి

జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ కు ఉద్దేశించిన బిల్లు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన చ‌ర్య‌;  పేద‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌ కు అద్దం ప‌ట్టేదన్న ప్ర‌ధాన మంత్రి

జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ కు ఉద్దేశించిన బిల్లు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన చ‌ర్య‌;  పేద‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌ కు అద్దం ప‌ట్టేదన్న ప్ర‌ధాన మంత్రి

జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ కు ఉద్దేశించిన బిల్లు ఒక చ‌రిత్రాత్మ‌క‌మైన చ‌ర్య‌;  పేద‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌ కు అద్దం ప‌ట్టేదన్న ప్ర‌ధాన మంత్రి


జ‌న‌ర‌ల్ కేట‌గిరీ పేద‌ల‌ కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ ను క‌ల్పించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు బీద వారి అభ్యున్న‌తి దిశ‌ గా వేసినటువంటి ఒక చ‌రిత్రాత్మ‌క‌మైనటు వంటి ముందడుగు.  ఇది ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ వ‌చ‌నబ‌ద్ధ‌త కు అద్దం ప‌ట్టే ఒక చ‌ర్య కూడా అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.  నేడు మ‌హారాష్ట్ర లోని సోలాపుర్ లో ఒక సార్వ‌జ‌నిక స‌భ ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ, ఈ బిల్లు  లోక్ స‌భ లో ఆమోదం పొందడం ఈ అంశం లో అబ‌ద్ధాల‌ ను వ్యాప్తి లోకి తీసుకొని వ‌స్తున్న వారంద‌రికీ  ఒక గ‌ట్టి స‌మాధానం అంటూ వ్యాఖ్యానించారు.  ఈ బిల్లు కు రాజ్య స‌భ లో ఆమోదం ల‌భించ‌గ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.  “జ‌న‌ర‌ల్ కేట‌గిరీ కి చెందిన ఆర్థికం గా వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్ ను అందించే ఒక చారిత్ర‌క బిల్లు ను మనం నిన్న‌టి రోజు న లోక్ స‌భ లో ఆమోదించుకొన్నాం.  ఇది స‌బ్‌కా సాథ్‌, స‌బ్‌కా వికాస్‌ అనే మా యొక్క సంక‌ల్పాన్ని బ‌ల‌ప‌ర‌చింది” అని ఆయ‌న చెప్పారు.   

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించి అస‌మ్ ప్రజల, ఇంకా ఈశాన్య ప్రాంతాల ప్ర‌జ‌ల హ‌క్కుల ను మ‌రియు అవ‌కాశాల ను ప‌రిర‌క్షించ‌డం జ‌రుగుతుందని హామీ ని ఇచ్చారు.  “పాకిస్తాన్‌ లో, బాంగ్లాదేశ్‌ లో, అఫ్గానిస్తాన్ లో నివ‌సిస్తున్న‌ భార‌త‌ మాత కుమారుల కు, కుమార్తెల కు భార‌త‌దేశపు పౌర‌స‌త్వాన్ని మంజూరు చేసేందుకు మార్గాన్ని ఈ బిల్లు సుగ‌మం చేసింది.  చ‌రిత్ర లో హెచ్చు త‌గ్గుల‌ ను గ‌మ‌నించిన అనంత‌రం మ‌న‌ ఈ సోద‌రులు మ‌రియు సోద‌రీమ‌ణులు భార‌త‌దేశం లో ఒక భాగం కావాల‌ని కోరుకుంటున్నారు” అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.
 
అవినీతి కి వ్య‌తిరేకంగా, ద‌ళారుల‌ కు వ్య‌తిరేకంగా త‌న ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు త‌న పైన దోషారోపణ లు వ‌స్తున్న‌ప్ప‌టి కీ కూడా వెనుకంజ అనేది లేకుండా కొన‌సాగుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ప్ర‌జ‌లు అందిస్తున్న మ‌ద్దతు, ఆశీర్వాదాల అండ‌ తో తాను అవినీతి పైన‌, మ‌ధ్య‌వ‌ర్తుల పైన ధైర్యం తో పోరాటాన్ని సాగిస్తూ స్వీయ క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తున్నట్లు ఆయ‌న చెప్పారు. 

సోలాపుర్ ప్రాంతం లో అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించ‌డం/ శ‌ంకుస్థాప‌న లు చేయ‌డం జ‌రిగిన త‌రువాత ఆ ప్రాంతం లో గ‌ల ఇందిరా గాంధీ స్టేడియ‌మ్ లో జ‌రిగిన ఒక సార్వ‌జ‌నిక స‌భ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు.  ‘‘ ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజ‌న’లో భాగం గా నిర్మించే 30,000 గృహాల‌ కు ప్ర‌ధాన మంత్రి పునాదిరాయి ని వేశారు.  ఈ ఇళ్ళ‌ ను ప్ర‌ధానంగా చెత్త‌ ను ఏరే వారు, రిక్షాల‌ ను న‌డిపే వారు, వ‌స్త్రాల మిల్లుల లో ప‌ని చేస్తున్న‌ వారు, బీడీ ల‌ను త‌యారు చేసే కార్మికులు త‌దిత‌ర పేద నిరాశ్ర‌య వ‌ర్గాల వారి ల‌బ్ది కోసం 1811.33 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో నిర్మించ‌డం జ‌రుగుతోంది.  పేద‌లు, కార్మికుల కుటుంబాల కోసం ఉద్దేశించిన‌టు వంటి 30,000 గృహాల తో కూడిన ఈ ప‌థ‌కాన్ని మ‌నం ఈ రోజు న ప్రారంభించుకొన్నాం.  కార్ఖానాల లో ప‌ని చేస్తున్న‌ వారు, రిక్షాల‌ను న‌డుపుతున్న వారు, ఆటో డ్రైవ‌ర్లు, త‌దిత‌ర వ‌ర్గాల వారు ఈ ప‌థ‌కం యొక్క ల‌బ్దిదారులు గా ఉన్నారు.  మీరంతా త్వ‌ర‌లోనే మీ సొంత ఇంటి తాళం చెవుల‌ ను మీ చేతుల లోకి తీసుకోగ‌లుగుతార‌ని నేను మీకు హామీ ని ఇస్తున్నాను’’ అని ఆయ‌న అన్నారు.  గృహ నిర్మాణాన్ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌ కు అందుబాటు లోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.  ఇక వారు 20 సంవ‌త్స‌రాల అవధి గల గృహ రుణాల పై  6 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాపు చేయ‌గ‌లుగుతారు.  ఇది ‘జీవించ‌డంలో సౌల‌భ్యం’ కోస‌మ‌ని ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ కు ఒక ప్ర‌తిబింబం గా ఉంది అని కూడా ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

తాను శంకుస్థాప‌న చేసిన ప‌థ‌కాల‌ ను తానే ప్రారంభిస్తాన‌ని చేసిన వాగ్దానాని కి అనుగుణం గా ప్ర‌ధాన మంత్రి నూత‌న ఎన్‌హెచ్‌-52 లో భాగం గా ఉన్న 98.717 కి.మీ. ల పొడ‌వైన మార్గాన్ని దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేశారు.  ఇది మ‌హారాష్ట్ర లోని ముఖ‌మైన‌టువంటి మ‌రాఠ్ వాడా ప్రాంతం తో సోలాపుర్ కు సంధానాన్ని మెరుగుప‌ర‌చ‌డం లో స‌హాయ‌కారి కానుంది.  ఎన్‌హెచ్‌-52 ప్ర‌స్తుతం ఒక నాలుగు దోవ‌లు క‌లిగినటువంటి సోలాపుర్-తుల్జాపుర్-ఉస్మానాబాద్ హైవే సెక్ష‌న్ గా రూపుదిద్దుకుంది.  దీని నిర్మాణాని కి 972.50 కోట్ల రూపాయ‌ల వ్య‌యం అయిన‌ట్లు అంచ‌నా.  ఈ ప‌థ‌కాని కి 2014వ సంవ‌త్స‌రం లో ప్ర‌ధాన మంత్రే శంకుస్థాప‌న చేశారు.  ఎన్‌హెచ్‌-52 లో తుల్జాపుర్ వ‌ద్ద 3.4 కి.మీ ల చుట్టుదారి ఉంది.  ఇది న‌గ‌రం లో ర‌ద్దీ ని త‌గ్గించ‌డం లో తోడ్ప‌డ‌నుంది.  అంతేకాకుండా, 2 పెద్ద వంతెన‌ లు, 17 చిన్న వంతెన‌ లు, 4 వాహ‌నాల కు సంబంధించిన అండ‌ర్‌పాస్ లతో పాటు పాద‌చారుల‌ కు ఉద్దేశించిన 10 అండ‌ర్‌పాస్ లు వంటి ర‌హ‌దారి భ‌ద్ర‌త వ‌స‌తులు ఇందులో భాగం గా ఉన్నాయి.

మెరుగైన సంధానం తో పాటు, ‘జీవ‌న సౌల‌భ్యం’ కోసం హైవేల ను విస్త‌రించాల‌న్నది ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  ‘‘ఈ సంద‌ర్భం గా గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల పైచిలుకు కాలం లో సుమారు 40,000 కి.మీ. ల జాతీయ ర‌హ‌దారుల‌ ను దాదాపు గా 5.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో జోడించ‌డం జ‌రిగింది.  అంతేకాక‌ 52 వేల కి.మీ.ల జాతీయ ర‌హ‌దారులు ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌ లో ఉన్నాయి’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ఈ ప్రాంతం లో రైలు మార్గాల సంధానానికి ఒక ప్రోత్సాహ‌క చ‌ర్య‌ ను ప్ర‌ధాన మంత్రి ప్రకటిస్తూ, ప్ర‌భుత్వం 1,000 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యం తో తుల్జాపుర్ ద్వారా సోలాపుర్- ఉస్మానాబాద్ రైలు మార్గాన్ని ఆమోదించింద‌న్నారు.  ప్రాంతీయ గ‌గ‌న‌త‌ల సంధాన ప‌థ‌కం అయినటువంటి ‘ఉడాన్ యోజ‌న’ లో భాగం గా సోలాపుర్ నుండి విమాన స‌ర్వీసుల‌ ను ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  

స్వ‌చ్ఛ్ భార‌త్ కు, స్వ‌స్థ భార‌త్ కు సంబంధించి త‌న విజన్ లో భాగం గా సోలాపుర్ లో భూగ‌ర్భ మురుగు పారుద‌ల వ్య‌వ‌స్థ ను, మూడు మురుగు నీటి శుద్ధి ప్లాంటుల‌ ను దేశ ప్ర‌జ‌ల‌ కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.  ఇవి ప‌ట్ట‌ణం లోని మురుగు నీటి వ్య‌వ‌స్థ ప‌రిధి ని పెంచ‌డం తో పాటు పారిశుధ్యాని కి మెరుగులు దిద్దుతాయి.

ఎఎమ్ఆర్‌యుటి (‘అమృత్‌’) మిశ‌న్ లో భాగం గా భూగ‌ర్భ మురుగు పారుద‌ల వ్య‌వ‌స్థ ను, ఉజాని ఆన‌క‌ట్ట నుండి సోలాపుర్ సిటీ కి త్రాగునీటి స‌ర‌ఫ‌రా పెంపుద‌ల ప‌థ‌కానికి, సోలాపుర్ స్మార్ట్ సిటీ లో ప్రాంతం వారీ అభివృద్ధి లో భాగం గా కంబైన్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ వాటర్ సప్లయ్ అండ్ సీవ‌రేజ్ సిస్ట‌మ్ కు ప్ర‌ధాన మంత్రి శంకుస్థాప‌న చేశారు.  ఇది పౌరుల‌ కు సాంకేతిక విజ్ఞానం అండ‌దండ‌ల‌ తో చ‌క్క‌ని ఫలితాల‌ ను అందించేందుకు, త‌ద్వారా ప్ర‌జారోగ్యాన్ని మెరుగు ప‌ర‌చేందుకు, మ‌రి అలాగే సేవ‌ల అంద‌జేత‌ ను గ‌ణ‌నీయంగా ఉద్ధ‌రించేందుకు తోడ్ప‌డ‌నుంది.

సోలాపుర్ మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల‌ లో ప్ర‌జ‌ల‌కు ర‌హ‌దారి, ఇంకా ర‌వాణా సంధానాన్ని, నీటి స‌ర‌ఫ‌రా, పారిశుధ్యం, ఉద్యోగ క‌ల్ప‌న‌ లను అందించే దిశ‌ గా ఈ చ‌ర్య‌ లు దోహ‌ద‌ప‌డుతాయని ఆశిస్తున్నారు. 

**