Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జైన ఆచార్య ర‌చించిన గ్రంథాన్ని వీడియో కాన్ఫ‌రెన్సింగ్ మాధ్య‌మం ద్వారా ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

జైన ఆచార్య ర‌చించిన గ్రంథాన్ని వీడియో కాన్ఫ‌రెన్సింగ్ మాధ్య‌మం ద్వారా ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి


జైన ఆచార్య ర‌త్న‌సుందర్ సురీస్వ‌ర్ జీ మ‌హ‌రాజ్ ర‌చించిన‌ “మారూ భార‌త్ సారూ భార‌త్” (నా ‌భార‌తదేశం శ్రేష్ఠ‌మైన భార‌త‌దేశం) పుస్త‌కాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ రోజు ఆవిష్క‌రించారు.

ర‌త్న‌త్ర‌యీ ట్ర‌స్టు కు చెందిన‌ సాహిత్య స‌త్కార్ స‌మితి ఆధ్వ‌ర్యంలో ముంబ‌యిలో ఏర్పాటైన గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగించారు. ఆచార్య ర‌త్న‌సుందర్ సురీస్వర్ జీ మ‌హ‌రాజ్ ర‌చ‌న‌లను ప్ర‌శంసించారు. 300 పుస్త‌కాల‌ను తీసుకురావ‌డం చిన్న విష‌యం కాదు అని ప్రధాని అన్నారు. ‘జీవ‌నానికి సంబంధించిన అనేక పార్శ్వాల ఛాయ‌లు మ‌హ‌రాజ్ సాహెబ్ రచనలలో ప్ర‌తిబింబిస్తున్నాయి’ అని ఆయన చెప్పారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ప్రేరణకు ఆలంబనగా నిలచిన మ‌హ‌రాజ్ సాహెబ్ “దివ్య వాణి” ఈ గ్రంథాలలో మారుమోగుతోందన్నారు. ఏ ధర్మాని (మతాని)కన్నా కూడా రాష్ట్ర ధ‌ర్మం మిన్న అని మ‌హ‌రాజ్ సాహెబ్ ప్రవచించారని ప్రధాని గుర్తు చేశారు. “సాధువుల పాత్ర ప్రశంసనీయమైనది. సంఘాన్ని జాతి నిర్మాణం వైపునకు నడిపించడంలో ముందు నిలిచిన ఎందరో సాధువులను, మునులను మన భారత దేశం వారసత్వంగా మనకు అందించింది. పేదరికాన్ని నిర్మూలించడంలో, స్వచ్ఛ భారత్ ను ఆవిష్కరించడంలో, లక్ష‌లాది యువ‌త‌ అనే శక్తిని ఉపయోగించుకొంటూ బలమైన దేశాన్ని నిర్మించుకోవడానికి ప్రజలంతా పాటుపడాలి” అని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

భారతదేశం ఎన్నడూ కూడా కులం/ మతం గురించి చెప్పలేదు, ఎల్లప్పుడూ మానవాళి మేలు కోసం ఆధ్యాత్మిక వాదం గురించే బోధిస్తూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. “ఆధ్యాత్మిక వాదం ద్వారా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించవచ్చని మనం నమ్ముతున్నాం” అని కూడా ఆయన చెప్పారు.

న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి గ్రంథావిష్కరణ చేసి, ప్రసంగించినందుకు ప్రధానికి ఆచార్య ర‌త్న‌సుందర్ సురీస్వ‌ర్ జీ మ‌హ‌రాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా “కుటుంబాల దగ్గర విలువలు, దేశాల దగ్గర సంస్కృతి నెలకొంటాయి” అని ఆచార్య ర‌త్న‌సుందర్ సురీస్వ‌ర్ జీ మ‌హ‌రాజ్ చెప్పారు.