Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జె పి మార్గ‌న్ ఇంట‌ర్‌ నేశ‌నల్ కౌన్సిల్ స‌భ్యుల తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జె పి మార్గ‌న్ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ కౌన్సిల్ తో న్యూ ఢిల్లీ లో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు. ఈ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ కౌన్సిల్ 2007వ సంవ‌త్స‌రం అనంత‌రం మొదటి సారి భార‌త‌దేశం లో స‌మావేశం అయింది.

ఈ ఇంట‌ర్‌ నేశ‌న‌ల్ కౌన్సిల్ లో బ్రిట‌న్ పూర్వ ప్ర‌ధాని శ్రీ టోనీ బ్లేయ‌ర్, ఆస్ట్రేలియా పూర్వ ప్ర‌ధాని శ్రీ జాన్ హొవార్డ్‌, యుఎస్ పూర్వ విదేశాంగ మంత్రులు శ్రీ హెన్రీ కిసింజర్, ఇంకా కోండొలిజా రాయిస్, పూర్వ ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాబ‌ర్ట్ గేట్స్ ల వంటి ప్ర‌పంచ రాజ‌నీతిజ్ఞుల‌ తో పాటు శ్రీ జేమీ డాయిమన్ (జె పి మార్గ‌న్ చేజ్), శ్రీ ర‌త‌న్ టాటా (టాటా గ్రూపు)ల వంటి ఆర్థిక జగతి కి మ‌రియు వాణిజ్య జ‌గ‌తి కి చెందిన ప్ర‌ముఖుల ప్రతినిధులు, నెస్లే, ఆలీబాబా, ఆల్ఫా, ఐబ‌ర్‌ డోలా, క్రాఫ్ట్ హైన్జ్ ల వంటి ప్ర‌పంచ కంపెనీల కు చెందిన అగ్రగామి ప్ర‌తినిధులు కూడా స‌భ్యులు గా ఉన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఈ బృందాని కి భార‌త‌దేశాని కి ఆహ్వానిస్తూ, 2024వ సంవ‌త్స‌రం క‌ల్లా భార‌త‌దేశాన్ని 5 ట్రిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ విలువైంది గా తీర్చిదిద్ద‌ాలన్న తన దార్శనికత ను గురించి వారి తో చ‌ర్చించారు. ప్ర‌పంచ శ్రేణి భౌతిక మౌలిక స‌దుపాయాల ను అభివృద్ధిపరచడం, త‌క్కువ ఖ‌ర్చు అయ్యే విధం గా ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ ను మెరుగుపరడం తో పాటు నాణ్య‌మైన విద్య బోధ‌న సౌకర్యాల ను స‌మ‌కూర్చ‌డం వంటివి మరికొన్ని ప్ర‌భుత్వ విధాన ప్రాథ‌మ్యాల లో ఉన్నాయని ఆయ‌న ఈ సందర్భం గా వివరించారు.

ప్ర‌జ‌ల ప్రాతినిధ్యం ప్ర‌భుత్వ విధాన రూప‌క‌ల్ప‌న కు ఒక మార్గ‌ద‌ర్శ‌క సూత్రం గా ఉంటోంది. విదేశాంగ విధానం విష‌యాని కి వ‌స్తే, న్యాయ‌మైన మ‌రియు అంద‌రికీ స‌మానమైన అవ‌కాశాలు ల‌భించేటటువంటి బ‌హుళ ధ్రువ ప్ర‌పంచ వ్య‌వ‌స్థ నిర్మాణాని కి త‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య దేశాల తో మ‌రియు స‌న్నిహిత‌ ఇరుగు పొరుగు దేశాల తో క‌ల‌సి ప‌ని చేయడాన్ని భార‌త‌దేశం కొన‌సాగిస్తుంద‌న్నారు.

**