Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జెశోరేశ్వ‌రి కాళీ శ‌క్తిపీఠం లో పూజ‌ చేసిన ప్ర‌ధాన‌ మంత్రి

జెశోరేశ్వ‌రి కాళీ శ‌క్తిపీఠం లో పూజ‌ చేసిన ప్ర‌ధాన‌ మంత్రి


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు ను దేవి కాళి ఆశీర్వాదాలను అందుకొని, ప్రారంభించారు.  శత్ ఖిరా లో జెశోరేశ్వ‌రి కాళీ శ‌క్తిపీఠం లో ప్ర‌ధాన‌ మంత్రి  పూజ‌ చేశారు.  ఈ శ‌క్తిపీఠం ప్రాచీన పరంపర లో 51 శ‌క్తిపీఠాల‌ లో ఒక‌ పీఠం గా ఉంది.  వెండి తో తయారు చేసి బంగారు పూత ను పూసినటువంటి కిరీటాన్ని కాళీ మాత కు ప్ర‌ధాన‌ మంత్రి సమర్పించారు.  ఒక స్థానిక హస్తకళాకారుడు మూడు వారాల కన్నా ఎక్కువ కాలం లో ఈ ముకుటాన్ని రూపొందించారు.
 

PM India

ప్ర‌ధాన‌ మంత్రి తన స్నేహ‌ హస్తాన్ని అందిస్తూ, ఈ ఆల‌యం సమీపం లో ఒక సాముదాయిక భవనాన్ని నిర్మించడానికి గాను ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.  ఈ భవనాన్ని ఏటా కాళీ పూజ‌, ఆల‌య మేళా సంద‌ర్భాల లో భక్తులు వినియోగించుకోనున్నారు.  అలాగే తుపాను స్థితి ఏర్పడినప్పుడు అన్ని ధర్మాలకు చెందిన వ్యక్తులు ఈ భవనాన్ని ఆశ్రయ స్థలం గాను, సాముదాయిక సదుపాయం రూపం లోను ఉప‌యోగించుకోనున్నారు.

 

***