Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జెనీవా లో స్విస్ సి ఇ ఒ లతో ప్రధాన మంత్రి భేటీ; ఆర్థిక బంధాల బలోపేతంపై దృష్టి కేంద్రీక‌ర‌ణ‌

జెనీవా లో స్విస్ సి ఇ ఒ లతో ప్రధాన మంత్రి భేటీ; ఆర్థిక బంధాల బలోపేతంపై దృష్టి కేంద్రీక‌ర‌ణ‌

జెనీవా లో స్విస్ సి ఇ ఒ లతో ప్రధాన మంత్రి భేటీ; ఆర్థిక బంధాల బలోపేతంపై దృష్టి కేంద్రీక‌ర‌ణ‌


వ్యాపారం, సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి మరియు పునరుత్పాదక శక్తి అంశాలలో సహకారంపై స్విస్ అధ్యక్షునితో చర్చలు

ప్రధాన మంత్రి తన అయిదు దేశాల పర్యటన మూడో రోజు జెనీవాలో స్విస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సి ఇ ఒ ల)తో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. పలు రంగాలకు చెందిన సి ఇ ఒ లు సమావేశంలో పాల్గొనడంతో ఆర్థిక బంధాలను పటిష్టపరచుకోవడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకృతం అయింది. ఎ బి బి, లాఫార్జ్, నొవార్తిస్, నెస్లే, రీటర్, రోష్ వగైరా స్విస్ వ్యాపార రంగంలో పలువురు ప్రముఖులు ప్రధాన మంత్రితో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.

వ్యాపార రంగ ప్రముఖులను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని, మా అభివృద్ధి అవసరాలు, స్విస్ బలాలు కలిస్తే ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇరు దేశాలకు మధ్య ఆర్థిక సంబంధాలు దృఢంగా, గతిశీలంగా ఉండడంతో తాను సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారతదేశం ఒక్క 125 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న దేశం మాత్రమే కాదని, మా దగ్గర ప్రావీణ్యాలు ఉన్నాయి, ఇంకా.. వ్యాపారం కోసం ఎటువంటి దాపరికం లేని ప్రభుత్వం పనిచేస్తోంది అని శ్రీ మోదీ చెప్పారు. భారతదేశం ప్రపంచ శ్రేణి ప్రమాణాలు కలిగిన తయారీ రంగం కోసం ఆకాంక్షిస్తోందని, అందుకని స్విస్ తరహా నైపుణ్యాభివృద్ధి భారతదేశానికి ఎంతో పొంతన కలిగినదని ప్రధాన మంత్రి చెప్పారు.

అంతకుముందు, ప్రధాన మంత్రి భారతదేశం, స్విట్జర్లాండ్ ల ద్వైపాక్షిక బహుముఖీన సంబంధాలపై స్విస్ అధ్యక్షుడు శ్రీ శ్నీడర్ అమ్మాన్ తో కలసి సమీక్షించారు. వ్యాపారం,సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం, నవీకరణయోగ్యమైన శక్తి రంగాలలో సహకారం వారి చర్చలలో చోటు చేసుకొంది. ఉమ్మడి కట్టుబాట్లు, విలువలు, ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అనేవి భారతదేశం మరియు స్విట్జర్లాండ్ సంబంధాలను నూతన శిఖరాలకు చేర్చగలుగుతాయని ప్రధాన మంత్రి తన అభిప్రాయాలను వెల్లడించారు.

సి ఇ ఆర్ ఎన్ కు చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులతో కూడిన ఒక బృందం కూడా ఈ రోజు జెనీవాలో ప్రధాన మంత్రిని కలుసుకొంది.