Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జులై31న ఉదయం 11 గంటల కు మన్ కీ బాత్ కార్యక్రమం జులై సంచిక ను వినవలసింది గా పౌరుల నుఆహ్వానించిన ప్రధాన మంత్రి


మన్ కీ బాత్ (మనసు లో మాట) కార్యక్రమం జులై సంచిక ను జులై 31వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు వినండంటూ పౌరులందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.

 

మన్ కీ బాత్ (మనసు లో మాట) కార్యక్రమం జూన్ సంచిక కు సంబంధించిన ఒక చిన్న పుస్తకాన్ని కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు. ఆ చిన్న పుస్తకం లో అంతరిక్షం లో భారతదేశం వేస్తున్న ఘనమైన ముందంజ లు, క్రీడా రంగం లో సాధించుకొంటున్న కీర్తి, రథ యాత్ర వంటి మరెన్నో ఆసక్తిదాయకమైనటువంటి అంశాలను పొందుపరచడమైంది.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘రేపటి రోజు న, అంటే జులై 31వ తేదీ న ఉదయం 11 గంటల కు ప్రసారం అయ్యే ఈ నెల #MannKiBaat (మనసు లో మాట) కార్యక్రమాన్ని వినండి అంటూ మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నాను.

దీనితో పాటు కిందటి నెల కు చెందిన అంశాల ను వివరించే ఒక చిన్న పుస్తకాన్ని కూడా నేను మీతో శేర్ చేసుకొంటున్నాను. ఆ అంశాల లో అంతరిక్షం లో భారతదేశం యొక్క గొప్పదైన పురోగతి, క్రీడామైదానం లో సాధించుకొంటున్న అద్భుతమైనటువంటి గౌరవం, రథ యాత్ర మొదలైనవి ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

*****

 

DS/TS