Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి7 సమిట్ లో భాగం గా రెండో రోజు న రెండు సమావేశాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

జి7 సమిట్ లో భాగం గా రెండో రోజు న రెండు సమావేశాల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


జి7 సమిట్ తాలూకు అవుట్ రీచ్ సెశన్స్ లో రెండో రోజు న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రెండు సమావేశాల లో పాల్గొన్నారు. ఆ రెండు సమావేశాలు ‘బిల్డింగ్ బ్యాక్ టుగెదర్-ఓపెన్ సొసైటీస్ ఎండ్ ఇకానమిస్’, (సంయుక్త పునర్ నిర్మాణం- బహిరంగ సమాజం మరియు ఆర్థిక వ్యవస్థ లు) ‘బిల్డింగ్ బ్యాక్ గ్రీనర్: క్లైమేట్ ఎండ్ నేచర్’ (సంయుక్త హరిత పునర్ నిర్మాణం- జలవాయు పరివర్తన మరియు ప్రకృతి) అనే పేరుల తో సాగాయి.

ఓపెన్ సొసైటీస్ (బహిరంగ సమాజాలు) సదస్సు లో  ప్రధాన వక్త గా ప్రసంగించవలసిందిగా ఆహ్వానం అందుకొన్న ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, స్వతంత్రత అనేవి భారతదేశం నాగరికత తాలూకు లక్షణాలు గా ఉన్నదీ గుర్తు చేశారు.  బహిరంగ సమాజాలు దుష్ప్రచారానికి, సైబర్ దాడుల కు గురి అయ్యే ప్రమాదం ఉందంటూ అగ్ర నేత లు వెలిబుచ్చిన ఆందోళన తో ఆయన ఏకీభవించారు.  సైబర్ స్పేస్ ను ప్రజాస్వామిక విలువల ను నష్టపరచడానికి కాకుండా మరింత ముందుకు నడిపించే సాధనం గా ఉండేటట్టు  చూడవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన నొక్కి చెప్పారు.  ప్రజాస్వామ్యేతర, అసమాన స్వభావం కలిగిన ప్రపంచ పాలన సంస్థల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, బహుస్థాయిల ప్రణాళిక లో సంస్కరణలే బహిరంగ సమాజాల అస్తిత్వాన్ని ఖాయంగా ఉంచేందుకు బాధ్యత వహించగలవన్నారు.  సమావేశం ముగింపు సందర్భం లో ‘బహిరంగ సమాజాల ప్రకటన’ ను నేత లు ఆమోదించారు.

 

PM India

జలవాయు పరివర్తన పై సమావేశం లో, ప్రధాన మంత్రి వేరు వేరు యూనిట్ ల రూపం లో పాటుపడే దేశాలు భూగ్రహం లో వాతావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని, భూమి ని ఆవరించి ఉన్నటువంటి సాగరాలను కాపాడజాలవు అని స్పష్టం చేస్తూ జలవాయు పరివర్తన విషయం లో సామూహిక కార్యాచరణ ను చేపట్టాలని పిలుపు ను ఇచ్చారు.  జలవాయు పరివర్తన కు వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న దృఢమైన వచనబద్ధత ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతీయ రైల్వేలు 2030 వ సంవత్సరానికల్లా నికరం గా సున్నా స్థాయి ఉద్గారాల దిశ గా సాగాలి అనే లక్ష్యాన్ని పెట్టుకొన్నట్లు తెలిపారు.  పారిస్ ఒప్పందం లోని తీర్మానాల ను ఆచరణ లోకి తీసుకు వచ్చే దిశ లో పురోగమిస్తున్నది జి-20 సభ్యత్వదేశాల లో ఒక్క భారతదేశం మాత్రమే అని ఆయన నొక్కి చెప్పారు.  భారతదేశం మొదలుపెట్టినటువంటి రెండు ప్రపంచ స్థాయి కార్యక్రమాలు.. ఒకటోది కోఎలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్ (సిడిఆర్ఐ), రెండోది ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ).. అంతకంతకు ప్రభావవంతం గా నిరూపితం అవుతున్నాయన్న విషయాన్ని గమనించాలి అని కూడా ఆయన అన్నారు.  మెరుగైన జలవాయు సంబంధి ధన సహాయం  అందవలసింది అభివృద్ధి చెందుతున్న దేశాల కే అని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, జలవాయు పరివర్తన దిశ లో ఒక సంపూర్ణమైనటువంటి వైఖరి ని అనుసరించాలని  పిలుపు ఇచ్చారు.  ఆ కోవ కు చెందిన విధానం సమస్య ను తగ్గించవలసిన అన్ని కోణాల ను స్పర్శించేది గాను, ప్రయోజనకారి కార్యక్రమాల ను అమలుపరచేది గాను, సాంకేతిక విజ్ఞానం బదిలీ, జలవాయు సంబంధి రుణ సహాయం, సమదృష్టి, జలవాయు సంబంధి న్యాయం, జీవనశైలి లో మార్పు వంటి ముఖ్య అంశాల తో కూడి ఉండాలి అన్నారు.  

ప్రపంచ దేశాల మధ్య సంఘటితత్వం, ఐకమత్యం అవసరం.. అది కూడాను మరీ ముఖ్యం గా బహిరంగ సమాజాల మధ్య మరియు ఆర్థిక వ్యవస్థల లో ఆరోగ్యం, జలవాయు పరివర్తన, ఇకనామిక్ రికవరి ల వంటి సవాళ్ల కు ఎదురొడ్డి నిలవడం లో సంఘటితత్వం, ఐకమత్యం ఏర్పడాలి.. అంటూ ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశాన్ని శిఖర సమ్మేళనం లో నేత లు స్వాగతించారు.

 

***